Mystery Temple: కృతయుగం నాటి ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహామనిత్వం.. ఎన్నో రహస్యాలకు నెలవు..

ఉజ్జయినిలోని మహాకాళ ఆలయం అని కూడా పిలువబడే శ్రీ మహాకాళేశ్వర ఆలయం భారతదేశంలోని శివుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని వద్ద షిప్రా నది ఒడ్డున ఉంది. ఉజ్జయినిలోని ఈ శివాలయం దాని అద్భుతమైన చరిత్ర, వైభవంతో పాటు 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థ ఉత్సవం (కుంభమేళా) కారణంగా ఇది దేశంలో, విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది.

Mystery Temple: కృతయుగం నాటి ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహామనిత్వం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
Ujjain Mahakal Temple

Updated on: Jun 30, 2025 | 7:26 AM

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. దీనిని దక్షిణముఖి జ్యోతిర్లింగం అని పిలుస్తారు. ఇక్కడ మహాకాళుడిని కాలానికి, మరణానికి దేవుడిగా భావిస్తారు. అందుకనే మహాకాళేశ్వరుడి దర్శనం భయం, పాపాల నుంచి విముక్తిని కలిగిస్తుందని చెబుతారు. మహాకాళేశ్వర ఆలయం అనేక రహస్యాలు, నమ్మకాలు ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభువుగా పరిగణించబడుతుంది.

మహాకాళంలో మహా, కాల అనే రెండు పదాలు ఉన్నాయి. సంస్కృతంలో మహా అంటే “గొప్ప”.. కాల అంటే “సమయం, మరణం అని అర్ధం. శివుడుని మృత్యువు, కాలానికి దేవుడు అని నమ్ముతారు. దీని కారణంగానే అతన్ని మహాకాళేశ్వర అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని మహాకాళ (మందిర) ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ ఆలయం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం. ఈ రోజు మహాకాళ ఉజ్జయిని ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

మహాకాళేశ్వర ఉజ్జయిని ఆలయ రహస్యం

మహాకాళేశ్వరుడు 43 లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడు అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

స్వయంభు శివలింగం: ఈ ఆలయంలోని శివలింగాన్ని స్వయంభుగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ శివలింగాన్ని ఏ మానవుడు స్థాపించలేదు. స్వయంగా ఉద్భవించింది.

భస్మ ఆరతి: ఈ ఆలయంలో నిర్వహించే భస్మ ఆరతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గతంలో చితి నుంచి తీసుకుని వచ్చిన భాస్మంతో అభిషేకం చేసేవారు. అయితే ఇప్పుడు ఆవు పిడకలను కాల్చగా వచ్చిన భస్మంతో హారతి నిస్తారు.

రాజు, మంత్రి ఉండరు: హిందూ మత విశ్వాసం ప్రకారం రాజు విక్రమాదిత్య కాలం నుంచి ఏ రాజు లేదా మంత్రి ఆలయంలో రాత్రి గడపరు. ఇది ఒక సాధారణ నమ్మకం, ఆచారం. రాజులు, మంత్రులు ఆలయంలో రాత్రిపూట నిద్రించకూడదని ఇది దైవత్వానికి, ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తుందని నమ్ముతారు.

దక్షిణ ముఖంగా ఉన్న శివలింగం: మహాకాళేశ్వర ఆలయంలోని జ్యోతిర్లింగం దక్షిణ ముఖంగా ఉంది. ఇది ఇతర జ్యోతిర్లింగాల కంటే భిన్నంగా ఉంటుంది. అందుకనే మహాకాళేశ్వరుని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు.

శక్తిపీఠం : ఈ ఆలయం 18 మహాశక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ సతీ దేవి పై పెదవి పడిపోయింది.

నాగచంద్రేశ్వర ఆలయం: నాగచంద్రేశ్వర ఆలయం ఈ ఆలయంలోని మూడవ అంతస్తులో ఉంది. ఇది సంవత్సరంలో నాగపంచమి రోజున మాత్రమే తెరుచుకుంటుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us