Lost cities in India: భారత దేశం పూర్వకాలంలో అభివృద్ధి చెందిన దేశం. ఎన్నో వింతలూ విడ్డురాలు నేటి విజ్ఞానానికి అందని తెలివి తేటలు.. మన పూర్వీకుల సొంతం.. ఇప్పుడు మనం సూర్యగమనాన్ని.. కాలాలను… గ్రహణాలను పరిశోధనలు చేసి తెలుసుకుంటున్నాం.. అయితే అప్పటి వారు.. నాలుగు వందల ఏళ్ల తర్వాత వచ్చే గ్రహణం గురించి కూడా కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టి చెప్పారు.. అంటే అంతటి విజ్ఞానం మన సొంతం. ఇక మధ్య యుగంలో పాలించిన రాజుల పాలన ఎన్నో అద్భుతమైన పట్టాలను నిర్మించారు.. అవి కాలక్రమంలో కనుమరుగయ్యినా నేడు పర్యాటక రంగాలుగా విలసిల్లుతున్నాయి. గత వైభంగా చిహ్నాలకు ప్రతీకలుగా నిలిచిన కొన్ని ప్రాంతాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..!
ద్వారక ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రాంతం.. కృష్ణుడు ఉన్నాడు ద్వారక ను పరిపాలించాడు అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ ప్రాంతం. శ్రీ కృష్ణుడి పరిపాలిస్తున్న సమయంలో రాజధానిగా ద్వారక పట్టణం గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలోకి మునిగిపోయింది. ఇక్కడ ఇప్పటికి కొన్ని అవశేషాలు కనపడతాయి. దేశంలో అతి పురాతన మత పర పట్టణం. చరిత్ర మేరకు శ్రీ కృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించాడని, ఆయన మరణం తర్వాత ఆ పట్టణాన్ని సముద్ర గర్భంలో ముంచివేశాడని పురాణాల్లో ద్వారా తెలుస్తోంది.
గుజరాత్ లో మాయమైన మరో పట్టణం డోలవీరా. స్థానికులు ఈ పట్టణాన్ని, కోటదటిమ్బా అని పిలుస్తారు. ఈ పట్టణంలో ఇప్పటికీ పురావస్తు ప్రదేశంలో సింధు లోయ నాగరికతకు సంబంధించిన పురాతన శిధిలాలు కలవు. ఈ పురాతన అవశేషాలు క్రీ. పూ. 2650 – 1450 ల నాటివిగా పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్పారు.
గుజరాత్ రాష్ట్రం లోనే మరుగున పడిన మరో పురాతన పట్టణం లోథాల్. ఈ పట్టణం పురాతన సింధు లోయ నాగరికతకు కేంద్రంగా విలసిల్లింది. ఈ ప్రదేశం నుండి పూసలు, రత్నాలు, మణులు, విలువైన బంగారు ఆభరణాలు వెస్ట్ ఆసియా, ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి అయ్యేవని తెలుస్తోంది. ఈ పట్టన ప్రజలు రత్నాల ఆభరణాల తయారీలో నిపుణులుగా ప్రపంచ ఖ్యాతిగాంచినట్లు చరిత్రకారులు చెప్పారు. అంతేకాదు లోథాల్ పట్టణం ప్రపంచంలోనే మొదటి రేవు పట్టణం గా ప్రసిద్ధి చెందినది.
తమిళనాడు లోని ఓ చిన్న పట్టణం పూమ్పుహార్. ఇది ఒకప్పుడు ఏంతో వైభవంతో విలసిల్లింది. కావేరి పుహుం పట్టినం పేరుతో ఈ పురాతన రేవు పట్టణం.. చోళ రాజుల రాజ్యానికి రాజధానిగా వుండేదని 7 వ శతాబ్దపు శాసన ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ పట్టణంలో అప్పటిలోనే ఎన్నో అభివృద్ధి చెందిన టెక్నాలజీతో పెద్దపెద్ద భవనాలున్నాయని తెలుస్తోంది. చోళ రాజుల పట్టభిషేకాలకు ఈ పట్టణం కేంద్ర బిందువని తెలుస్తోంది.
ముజిరిస్ ఇది మన దేశంలో అతి పురాతన సముద్ర రేవు పట్టణం.. సుమారు ఒకటవ శతాబ్దంలో వుండేదని తెలుస్తోంది. అయితే ఈ సముద్ర రేవు ద్వారా అప్పటి దక్షిణ భారత దేశ ప్రజలు ఫోయనిషిన్లు, ఈజిప్షియన్ లు గ్రీకులు, రోమన్ సామ్రాజ్యం లతో వ్యాపారాలు చేసేవారని చరిత్రకారులు వెల్లడించారు. అయితే ఈ ప్రదేశం సుమారుగా కేరళ లో కోచిన్ కు ఉత్తరంగా 18 మైళ్ళ దూరంలో ప్రస్తుత క్రాగాన్ కోర్ కు సమీపంలో ఉండేదని భావిస్తున్నారు. అంతేకాని ముజిరిస్ పట్టణం ఖచ్చితంగా ఎక్కడ వుందనేది చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
విజయనగర సామ్రాజ్య వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పురాతన శాస్తవేత్తలు చెబుతారు. విజయనగరాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు పాలిస్తున్న వైభవోపేత రోజులలో సుమారు అయిదు లక్షల మంది ప్రజలుండేవారని తెలుస్తోంది. ఇప్పటికీ అప్పటి పాలనలోని వైభవం అంతా హంపి శిధిలాలో చూడవచ్చు. ఒకప్పుడు ప్రపంచంలో పెకింగ్ – బీజింగ్ పట్టణాల తర్వాత రెండవ పెద్ద పట్టణంగా వుండేది. హంపి లోని శిధిలాలు నేడు ఒక వరల్డ్ హెరిటేజ్ ప్రదేశంగా గుర్తించబడ్డాయి.
హరప్ప చరిత్రకు సజీవ సాక్ష్యం కాలిబంగాన్ పట్టణం. ఇప్పటికీ హరప్ప శిధిలాలు కలిగి వుంది. రాజస్తాన్ లోని గగ్గర్ నది దక్షిణపు భాగం లోని ప్రదేశాన్ని కాళీ బంగాన్ పట్టణం అనే వారు.సింధులోయ నాగరికతకు ఈ ప్రాంతం కేంద్ర బిందువని చరిత్ర చెప్తోంది. ఇక్కడ ప్రపంచపు మొట్ట మొదటి దున్నిన పొలం వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాష్ట్రం లో ఉన్న పట్టదక్కాల్ పట్టణం ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం. ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చాళుక్య రాజుల చారిత్రక స్మారకాలతో నేటికీ ఈ పట్టణానికి ప్రత్యేక గురింపు సొంతం చేసుకుంది.
Also Read: