ఓరుగల్లు చారిత్రక నగరంలో మరో అద్భుతం..త్వరలోనే ప్రారంభించనున్న కేటీఆర్

కాకతీయుల శిల్పకళా వైభవానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఓరుగల్లు. చారిత్రక నగరంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. హనుమకొండ నడిబొడ్డున కొండను తొలిచి పర్యాటక కేంద్రంగా మలిచిన తీరు సందర్శకులను ఔరా అనిపిస్తోంది.

ఓరుగల్లు చారిత్రక నగరంలో మరో అద్భుతం..త్వరలోనే ప్రారంభించనున్న కేటీఆర్
Follow us

|

Updated on: Oct 01, 2020 | 5:45 PM

  • కాకతీయుల శిల్పకళా వైభవానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఓరుగల్లు
  •  చారిత్రక నగరంలో ఆవిష్కృతమైన మరో అద్భుతం
  • గోమఠేశ్వర్‌ తరహాలో ఓరుగల్లులో జైన క్షేత్రం
  • ‘హృదయ్‌’ పథకం దక్కిన ఏకైక నగరం ఓరుగల్లు
  • 35 కోట్ల నిధులతో ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి
  • త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

కాకతీయుల శిల్పకళా వైభవానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఓరుగల్లు. చారిత్రక నగరంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. హనుమకొండ నడిబొడ్డున కొండను తొలిచి పర్యాటక కేంద్రంగా మలిచిన తీరు సందర్శకులను ఔరా అనిపిస్తోంది. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఆ పర్యాటక క్షేత్రం అనేక విశేషాలు, విశిష్టాతలను సంతరించుకుంది.

కాకతీయుల రాజధాని ఓరుగల్లు.. చారిత్రక కళలకు, కళా ఖండాలకు పుట్టినిల్లు.. ఇప్పటికే దేశ విదేశాల నుండి ఈ చారిత్రక సంపదను వీక్షించడం కోసం పెద్దఎత్తున పర్యాటకులు వస్తుంటారు.. అలాంటి అద్భుత చరిత్రకు మరో కలికి తురాయి తోడైంది. వరంగల్ లోని అగ్గలయ్యగుట్ట పై ఉన్న ప్రతీ రాయి గత చరిత్ర ని గుర్తు చేస్తుంది.. హనుమకొండలోని పద్మాక్షి ఆలయం దగ్గరలో అగ్గలయ్య గుట్ట ఉంటుంది..ఈ గుట్టపై 16 వ జైన తీర్ధంకరుడైన శాంతినాధుని దిగంబర విగ్రహం 30 అడుగుల ఎత్తులో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది.

ఈ విగ్రహం బయటపడటం ద్వారా ఈ ప్రదేశాన్ని జైనులు తపస్సు కోసం ఉపయోగించుకున్న చోటు కావచ్చని.. దీన్ని జైన ఆరామం(జ్ఞాన మందిరం) కూడా కావచ్చని భావిస్తున్నారు..ఐతే హన్మకొండ చౌరస్తా సమీపంలోని పద్మాక్షి, సిద్ధులగుట్టలకు ఉత్తరంగా ఉన్న ఈ అగ్గలయ్య గుట్టపై ఉత్తరాభిముఖాన 30 అడుగుల ఎత్తులో ఉల్బణ (అర్ధ) శిల్పం కూడా ఉన్నది. ఇదే గుట్టపై ఏడు జైన తీర్థంకుల అర్ధశిల్పాలున్నాయి. వీటిలో పార్శ్వనాథున్ని తేలిగ్గా గుర్తించవచ్చు. తలపై ఏడు పడగల సర్పం గొడుగుపట్టి నేలదాక మెలికలు తిరిగి నిలిచి ఉంటుంది.

అంతటి చరిత్ర కలిగిన ఈ అగ్గలయ్య గుట్టపైన దాదాపు 35 నుంచి 40 అడుగుల ఎత్తైన దిగంబర తీర్దంకరుడి విగ్రహం ఒక బండ రాయి పైన చెక్కబడి ఉంటుంది.. ఈ విగ్రహం పక్కన 13 అడుగుల మరో తీర్దంకరుడి విగ్రహం కన్పిస్తుంది. రెండూ చూడ్డానికి ఒకేలా ఉన్నా, రెండింటికీ తేడా ఉంటుంది. ఆ విగ్రహాలూ, వాటి చుట్టూ ఉన్న గుర్తులను బట్టి పెద్ద విగ్రహాన్ని మూడో తీర్దంకరుడైన సంభవ నాదుడిగా, చిన్న విగ్రహాన్ని 23 వ తీర్దంకరుడైన పార్శ్వనాదుడి గా చెబుతారు.. మొత్తం జైన తీర్దంకరులు 24 మంది.. అందరి విగ్రహాలు ఒకేలా ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కో చిహ్నం ఉంటుంది. వాటిని బట్టి ఆ తీర్ధంకరులను గుర్తించవచ్చు. మూడో వాడైన సంభవనాదుడి చిహ్నం గుర్రం.. ఈ గుట్ట మీద ఉన్న పెద్ద విగ్రహం పాదాల దగ్గర ఉన్నది గుర్రం చిహ్నాన్ని బట్టి ఆ విగ్రహం ఎవరిదో తెలుస్తుంది.. దేశంలోని వివిధ జైన ఆలయాల్లో ఉన్న సంభవనాదుడి విగ్రహాల పాదాల చెంత ఈ గుర్రం చిహ్నం కన్పిస్తూ ఉంది.. ఈ ప్రదేశాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది.

కాకతీయుల కాలంనాటి ఎన్నో అద్భుత దేవాలయాలు, శిల్ప సంపదతో అలరారుతున్న ఓరుగల్లు పర్యాటక ప్రాంతాల ఖాతాలో ఇప్పుడు ఈ ఆకర్షణ చేరనుంది. కొండపై కొలువైన జైన మందిరం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లడంతో పాటు, ఆహ్లాద కేంద్రంగా మారనుంది.. హన్మకొండలోని అగ్గలయ్య గుట్టను ‘హృదయ్‌’ పథకం కింద అభివృద్ధి చేశారు. జైన తీర్థంకరుల విగ్రహాలకు నిలయమైన ఈ భారీ గుట్టపైకి చేరుకునేందుకు 450మెట్లను తొలిచి మార్గాన్ని ఏర్పాటు చేశారు.. రాతితో స్వాగత తోరణాలు నిర్మించి.. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కోవిడ్ వల్ల ఈ గుట్టపైకి ప్రస్తుతం పర్యాటకులను అనుమతించడం లేదు. అభివృద్ధి పూర్తి చేసి పర్యాటకులకు కనువిందు చేసేందుకు అంతా సిద్ధంగా ఉంచారు. కర్ణాటకలోని గోమఠేశ్వర్‌ తరహాలో ఓరుగల్లులో ఈ జైన క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

రాష్ట్రంలో ‘హృదయ్‌’ పథకం దక్కిన ఏకైక నగరం ఓరుగల్లు. రూ.35 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను ఖిలావరంగల్‌, వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి బండ్‌, పద్మాక్షిగుట్ట లాంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించారు. అయితే, హన్మకొండలోనే అత్యంత ఎత్తయిన అగ్గలయ్య గుట్టమీద జైన తీర్థంకరుల విగ్రహాలతో పాటు జైనుల గుహల ఆనవాళ్లు ఎన్నో ఉన్నా.. గతంలో అభివృద్ధికి నోచుకోలేదు. జైన తీర్థంకరుడైన శాంతినాథుడి 30 అడుగుల భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నా..కొండపైకి వెళ్లే దారి లేకపోవడంతో వెలుగులోకి రాలేదు. ఈ ప్రదేశం గురించి అప్పటి వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి, ప్రస్తుత ప్రభుత్వ చీప్ విప్ వినయ్ భాస్కర్ కు తెలియడంతో పూర్తిస్థాయిలో పరిశీలించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.. వెంటనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రచించారు.

అలా కొండపైకి మెట్లతోపాటు ప్రవేశమార్గంలో శిలాతోరణ నిర్మాణం పూర్తయింది. సహజత్వం దెబ్బతినకుండా భారీ బండరాళ్ల మధ్య నుంచి శిల్పులు మెట్ల దారిని ఏర్పాటు చేశారు. దారి పొడవునా పూల మొక్కలు, ఉద్యానవనాల్ని పెంచారు. విద్యుత్తు దీపాలు, నీటి ఫౌంటేన్లు, మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ చారిత్రక ప్రదేశాన్ని ప్రజలకు అంకితం చేయనున్నారు..

Latest Articles
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..