Gem Of Astrology
ప్రస్తుతం వెండి నగలు ఓ ట్రెండ్.. పట్టీలు, మెట్టెలు మాత్రమే కాదు.. ఇప్పుడు బాగారం స్థానమలో వెండి తో రకరకాల ఆభరణాలను తయారు చేస్తున్నారు. వీటిని ఎక్కువమంది ఇష్టంగా ధరిస్తున్నారు. జ్యోతిషశాస్త్రంలో వెండి చంద్రునికి సంబంధించినది.. కనుక వెండితో చేసిన ఆభరణాలు ధరించడం వలన మనస్సు , మెదడు బలపడుతుందని నమ్ముతారు. ఎవరి జాతకంలోనైనా చంద్ర దోషం ఉన్నా.. సమస్యలున్నా కూడా పరిష్కారమవుతాయి. అయితే కొంత మంది వెండి ఆభరణాలు ధరించడం వలన మంచి కంటే నష్టాలు కూడా ఉన్నాయి.
వెండిని ధరించడం వల్ల గ్రహాలు, నక్షత్రాల పరిస్థితి మరింత దిగజారుతుంది .
వాస్తవానికి కొంత మంది వెండిని ధరించడం వల్ల కొన్ని గ్రహాలు, రాశుల పరిస్థితి మరింత దిగజారిపోతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అప్పుడు ప్రయోజనాలకు బదులుగా, వెండి ఆభరణాలు ధరించడం వల్ల నష్టాలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో కొంతమంది వెండి ఆభరణాలు ధరించడం పూర్తిగా నిషేధించబడింది. కనుక వెండి ఆభరణాలను ఏ వ్యక్తులు ధరించకూడదో తెలుసుకుందాం.
ఏ వ్యక్తులు వెండిని ధరించకూడదంటే
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరు వ్యక్తులు చాలా భావోద్వేగంగా ఉంటారు లేదా చాలా కోపంగా ఉంటారు. అలాంటి వారు వెండి ఆభరణాలు ధరించకూడదు. అలాంటి వారు వెండి ఆభరణాలు ధరిస్తే వారిలో భావోద్వేగాలు, కోపం రెండూ పెరుగుతాయి.
- చంద్రుని దృష్టిలో ఉంచుకుని వెండి ఆభరణాలు ధరిస్తారు. ఎవరి జాతకంలో చంద్రుడు 12వ లేదా 10వ ఇంట్లో ఉంటాడో వారు వెండి ఆభరణాలు ధరించడం మానుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
- వృషభం, మిథునం, కన్య, మకర రాశి, కుంభ రాశి వారు కూడా జ్యోతిష్యం ప్రకారం వెండి ఆభరణాలు ధరించడం మంచిది కాదు
- ఎవరి జాతకంలో శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు ఆధిపత్యంలో ఉంటాడో వారు కూడా వెండి ఆభరణాలు ధరించడం మానుకోవాలి.
- జాతకంలో చంద్రుడు క్షీణించిన వారు లేదా మనస్సు ఎల్లప్పుడూ చెదిరిపోయే వ్యక్తులు వెండి ఆభరణాలను ధరించకూడదు. అదే విధంగా చల్లని స్వభావం ఉన్నవారు వెండికి దూరంగా ఉండాలి.
- మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశుల వారు వెండి ఆభరణాలు ధరించడాన్ని కూడా జ్యోతిష్య శాస్త్రం నిషేధిస్తుంది.
- వెండిని ధరించే ముందు, జాతకంలో చంద్రుడు, ఇతర గ్రహాల స్థానం తెలుసుకోవాలని చెబుతున్నారు జ్యోతిష్యులు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.