Telugu News Spiritual Astrology tips the habit of moving legs while sitting is inausp in telugu
Astro Tips: కూర్చుని పాదాలు కదుపుతున్నారా.. అనారోగ్యం, డబ్బు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే.
పాదాలను కదిలించడం అశుభం. ఈ అలవాటు ఆరోగ్యంతో పాటు సంపదపై చెడు ప్రభావం చూపుతుందని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూర్చున్న సమయంలో పాదాలను కదిలించడం ఎందుకు అశుభమో ఈరోజు తెలుసుకుందాం.. పాదాలు ఊపడం వలన జరిగే నష్టాల గురించి తెలుసుకున్న తర్వాత.. ఎవరైనా సరే ఈ అలవాటును వదిలివేస్తారు.
చాలామంది కూర్చున్న సమయంలో తమ పాదాలను నిరంతరం కదిలిస్తూనే ఉంటారు. ఈ అలవాటు చాలామందిలో ఉంటుంది. అయితే ఇలా చేయడంవలన ఇంటికి మంచి కాదంటూ ఆ ఇంటి పెద్దవారు వారిస్తూ ఉండడం అందరికి తెలిసిందే.. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ విధంగా పాదాలను కదిలించడం అశుభం. ఈ అలవాటు ఆరోగ్యంతో పాటు సంపదపై చెడు ప్రభావం చూపుతుందని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూర్చున్న సమయంలో పాదాలను కదిలించడం ఎందుకు అశుభమో ఈరోజు తెలుసుకుందాం..
పాదాలు ఊపడం వలన జరిగే నష్టాల గురించి తెలుసుకున్న తర్వాత.. ఎవరైనా సరే ఈ అలవాటును వదిలివేస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచం మీద లేదా ఎత్తైన ప్రదేశంలో కుర్చీపై కూర్చుని వేలాడుతున్న తమ కాళ్ళను నిరంతరం కదిలిస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన మీ జాతకంలో చంద్రుడు బలహీనపడతాడు. మానసిక ఆందోళనకు గురవుతారు.
చంద్రుని అశుభ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా శాంతి ఉండదు. ఈ వ్యక్తి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. కూర్చొని పాదాలను నిరంతరం కదపడం వల్ల కూడా లక్ష్మీదేవి కి కోపం వస్తుంది. అనుగ్రహం కలుగదు అని విశ్వాసం.
డబ్బు ఖర్చు పెరిగి పేదరికం పెరుగుతుంది. భోజనం చేసేటప్పుడు కూడా పాదాలు కదిలిస్తే అన్నపూర్ణ తల్లికి కోపం వచ్చి ఇంట్లో ధన, ధాన్యాల కొరత ఏర్పడుతుంది. పూజ చేసేటప్పుడు పాదాలను నిరంతరం కదిలిస్తే పూజ ఫలం లభించదు.
పాదాలను కదిలించే అలవాటు వ్యక్తి మానసిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కనుక అటువంటి పరిస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించలేడు. మనోబలం తగ్గుతుంది. వైద్య శాస్త్రంలో కూడా కాళ్లను కదిలించే అలవాటును రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు.
ఇది తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా, గుండె, కిడ్నీ , పార్కిన్సన్ వంటి సమస్యలు కూడా పెరుగుతాయి.