Astrology: కొత్త సంవత్సరంలో ఈ రాశులకు అదృష్టం మామూలుగా లేదు..

|

Mar 27, 2024 | 5:39 PM

హిందూ సంప్రదాయం ప్రకారం ఉగాది పండుగనే కొత్త సంవత్సరంగా భావిస్తారు. ఈ ఏడాది ఉగాది పర్వ దినం ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉగాదిన.. ఆరు రుచులు కలగలిపిన పచ్చడిని తయారు చేస్తారు. ఈ పచ్చడి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండాలని ఉగాది పచ్చడిని తింటూ ఉంటారు. ఉగాది రోజున మహా విష్ణువును, లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ..

Astrology: కొత్త సంవత్సరంలో ఈ రాశులకు అదృష్టం మామూలుగా లేదు..
Astrology
Follow us on

హిందూ సంప్రదాయం ప్రకారం ఉగాది పండుగనే కొత్త సంవత్సరంగా భావిస్తారు. ఈ ఏడాది ఉగాది పర్వ దినం ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉగాదిన.. ఆరు రుచులు కలగలిపిన పచ్చడిని తయారు చేస్తారు. ఈ పచ్చడి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండాలని ఉగాది పచ్చడిని తింటూ ఉంటారు. ఉగాది రోజున మహా విష్ణువును, లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఉగాది పండుగ రోజున పంచాగ శ్రవణం కూడా వింటూ ఉంటారు.

ఈ కొత్త సంవత్సరంలో ఉగాది రోజున మూడు అరుదైన యోగాలు ఏర్పాడబోతున్నాయి. ఇవి దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్నాయి. అవి అమృత సిద్ధి యోగం, సర్భార్థ సిద్ధి యోగం, శశ రాజయోగం. ఈ యోగాలకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన యోగాలు ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభ ప్రదంగా ఉండనుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి:

ఇవి కూడా చదవండి

కొత్త సంవత్సరంలో వృషభ రాశికి ఈ యోగాలు కలిసి రాబోతున్నాయి. కాబట్టి వృషభ రాశికి ఈ ఏడాది చాలా శుభప్రదంగా ఉంది. వీరికి ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ సిద్ధి ఉంది. ఉద్యోగస్తులకు కూడా ప్రశంసలతో పాటు జీతాలు కూడా పెరగనున్నాయి. ఆర్థికంగా ఊహించని లాభాలు కలగబోతున్నాయి. ధన ప్రవాహం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మిథున రాశి:

ఈ ఏడాది కొత్త సంవత్సరంలో మిథున రాశికి కూడా చాలా శుభప్రదంగా ఉంది. మిథున రాశికి కూడా ఈ మూడు యోగాలు సిద్ధిస్తున్నాయి. కాబట్టి వీరికి అన్ని రకాల చాలా బావుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. స్థిరాస్తులు, కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారం చేస్తున్నవారికి, ఉద్యోగం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశికి కూడా ఈ ఏడాది ఈ మూడు ప్రత్యేకమైన యోగాలు కలిపి వస్తున్నాయి. ఈ ఏడాది ధనుస్సు రాశి వారికి బాగా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా లాభాలు పొందుతారు. ఎంతో ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా కూడా బాగా అనుకూలంగా ఉంది. ధైర్యం, ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతాయి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ తీరి.. ఆనందంగా గుడపుతారు. లాభాలు పెరిగి.. ఖర్చులు తగ్గుతాయి.