AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?

భద్రాద్రి రాములోరి కల్యాణానికైనా.. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకైనా కోనసీమ నుంచి కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే..! శంఖు చక్రాలు, తిరునామాలు, సీతారాములవారి పేర్లను ప్రత్యేకంగా కొబ్బరిబోండాలపై తీర్చీదిద్ది రాములోరి కల్యాణానికి పంపించడం 26 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు గత రెండు దశాబ్దాలకు పైగా తమభక్తిని చాటుకుంటున్నారు.

రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?
Mandapeta Coconuts
Balaraju Goud
|

Updated on: Mar 27, 2026 | 8:50 AM

Share

భద్రాద్రి రాములోరి కల్యాణానికైనా.. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకైనా కోనసీమ నుంచి కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే..! శంఖు చక్రాలు, తిరునామాలు, సీతారాములవారి పేర్లను ప్రత్యేకంగా కొబ్బరిబోండాలపై తీర్చీదిద్ది రాములోరి కల్యాణానికి పంపించడం 26 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.

తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట, ఆయోధ్య తోపాటు దేశవ్యాప్తంగా శ్రీసీతారాముల కార్యక్రమమేదైనా సరే.. కోనసీమ జిల్లా మండపేట నుంచి కొబ్బరి బోండాలు తరలివెళ్లాల్సిందే. ఇలా ఒకటి, రెండు సంవత్సరాలు కాదు.. 26 ఏళ్లుగా ఈ అనవాయితీ కొనసాగుతోంది.

మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు గత రెండు దశాబ్దాలకు పైగా తమభక్తిని చాటుకుంటున్నారు. కొబ్బరి బోండాలపై శంఖు చక్ర నామాలతో పాటు సీతారాముల చిత్రాలను అత్యంత కళాత్మకంగా అలంకరించి స్వామివారి ఆలయాలకు పంపిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీ ప్రకారమే కొబ్బరి బోండాలు ఇటు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి.. అటు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు తరలివెళ్లాయి. రాములోరి పెళ్లికి తమ ఇంటి నుంచి కొబ్బరి బోండాలు వెళ్లడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు రామారెడ్డి.

2024లో అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్ఠాపన, కళ్యాణ వేడుకల కోసం కూడా మండపేట నుంచే ప్రత్యేకంగా కొబ్బరిబోండాలను పంపించారు. మొత్తంగా మండపేట కొబ్బరి బోండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకతను చాటుకుంటోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us