AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగబంధం, భైరవ బంధనం కలిగిన అతి పురాతన శైవ క్షేత్రం.. శివుడి స్పర్శతో పులకరిస్తున్న నాగుపాము..!

హనుమకొండలోని ప్రాచీన సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఓ నాగుపాము భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయంలోని స్వయంభు శివలింగం చుట్టూ నాగుపాము సంచరిస్తూ కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజూ శివలింగం చుట్టూ తిరుగుతూ స్వామివారిని స్పర్శిస్తున్నట్లుగా కనిపిస్తుండటంతో భక్తులు దీనిని శివుడి మహత్యంగా భావిస్తున్నారు.

Mysterious Snake
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 15, 2026 | 5:15 PM

Share

హనుమకొండలోని ప్రాచీన సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఓ నాగుపాము భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయంలోని స్వయంభు శివలింగం చుట్టూ నాగుపాము సంచరిస్తూ కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజూ శివలింగం చుట్టూ తిరుగుతూ స్వామివారిని స్పర్శిస్తున్నట్లుగా కనిపిస్తుండటంతో భక్తులు దీనిని శివుడి మహత్యంగా భావిస్తున్నారు.

నాలుగు వైపులా ఎత్తైన కొండల మధ్య కొలువుదీరిన ఈ పురాతన శైవ క్షేత్రానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని భక్తులు చెబుతున్నారు. ఆలయంలో నాగబంధం, భైరవ బంధనం వంటి విశిష్టతలు ఉన్నాయని స్థానికుల విశ్వాసం. స్వయంభువుగా వెలసిన సిద్దేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు.

ఇటీవల గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షమవుతూ శివలింగం చుట్టూ సంచరిస్తుండటంతో భక్తుల్లో ఆసక్తి మరింత పెరిగింది. నాగుపాము శివలింగాన్ని తాకుతూ, కొద్దిసేపు దాని చుట్టూ ఉండటం చూసిన భక్తులు పరమశివుడి అనుగ్రహంగా భావిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

అయితే, గర్భగుడిలోకి పాము ప్రవేశించడం సహజసిద్ధమైన ఘటన కావచ్చని, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పామును దగ్గరగా వెళ్లి చూడటం, ఇబ్బంది పెట్టడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలయ పరిసరాల్లో సూచిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగారం, వెండి ధరలకు భారీ షాక్‌.. MCXలో ఎందుకు పడిపోతున్నాయంటే?

7 ఫోర్లు, 3 సిక్స్‌లతో తొలి సెంచరీ.. 2 ఏళ్ల అరుదైన జాబితా

సిద్దేశ్వర ఆలయంలో నిత్యం శివలింగంపై నాగుపాము..!

కర్ణాటకలో విషాదం.. ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి

ఏపీకి బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..?

22 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. బద్దలైన సచిన్ ఆల్‌టైమ్ వన్డే రికార్డ్

రైలు బయలుదేరేటప్పుడు.. ఆగినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

11 ఏళ్లు కీమోథెరపీ తీసుకుం..చివరకు ఏం తెలిసిందో వింటే షాకవుతారు!

వైభవ్ vs శాంసన్.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గంభీర్?

స్నేహితుల కళ్ల ముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు!