గాంధీజీ ! ఇదేనా ప్రజాస్వామ్యం ?

కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఢిల్లీని కూడా వేడెక్కిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ గురువారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ధర్నా చేశారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ… తమ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ‘ సేవ్ డెమోక్రెసీ అని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టుకుని నిరసనకు దిగారు. […]

గాంధీజీ ! ఇదేనా ప్రజాస్వామ్యం ?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 8:49 PM

కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఢిల్లీని కూడా వేడెక్కిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ గురువారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ధర్నా చేశారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ… తమ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ‘ సేవ్ డెమోక్రెసీ అని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టుకుని నిరసనకు దిగారు. కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీజేపీ అక్రమ పద్దతుల్లో ప్రభుత్వాలను కూల్చివేసే కుట్ర చేస్తోందని వీరు ఆరోపించారు. కాంగ్రెసేతర పార్టీలైన టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఎం పార్టీల నేతలు కూడా ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు.