మరింత క్షీణించిన శివప్రసాద్ ఆరోగ్యం.. చెన్నైకి చంద్రబాబు పయనం

Former MLA Siva Prasada Rao Health Updates, మరింత క్షీణించిన శివప్రసాద్ ఆరోగ్యం.. చెన్నైకి చంద్రబాబు పయనం

టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఇవాళ శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శివప్రసాద్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్నారు. కాగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు చెన్నై వెళ్లి శివప్రసాద్‌ను పరామర్శించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *