Breaking News
  • విశాఖ: మనీలాండరింగ్ కేసు . కింగ్ పిన్ బీకే గోయల్ కు ముగిసిన ఈడీ కస్టడీ. అయిదురోజుల పాటు బీకే గోయల్ ను విచారించిన ఈడీ అధికారులు. 1500 కోట్లకు పైగా ఇంటర్నేషనల్ హవాలా నడిపించిన బికె గోయల్. వడ్డి మహేష్, అనుచరులతో కలిసి హవాలా బిజినెస్. చైనా, హాంకాంగ్, మలేషియాలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మనీలాండరింగ్. గోయల్ బ్యాంక్ అకౌంట్లు, అర్ధిక లావాదేవీలపై ఇప్పటికే ఆధారాలను సేకరించిన ఈడీ. 5 రోజుల కస్టడీలో కీలక సమాచారం సేకరించిన అధికారులు. టీవీ9 తో ఈడీ పీపీ పుల్బా శ్రీనివాసరావు.
  • పార్లమెంట్ సమావేశాలు త్వరగా ముగించే అవకాశం.. బీఏసీ సమావేశంలో పలు పార్టీల నేతల ప్రతిపాదన. జీవితాలను రిస్కులో పెట్టుకోలేమని వ్యాఖ్య. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన బీఏసీ సమావేశం. ఈ నెల 24తో సమావేశాలు ముగించే అవకాశం. సమావేశాలు త్వరగా ముగించే విషయంలో ఏకాభిప్రాయం. బీఏసీ సమావేశంలో పలువురు నేతల అభిప్రాయం. కోవిడ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై చర్చ కోరిన కాంగ్రెస్. బిల్లులు పాస్ చేయాలని చూస్తున్న అధికారపక్షం. తేదీలను ఖరారు చేయనున్న స్పీకర్.
  • తిరుమల: టిటిడి డిక్లరేషన్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన టిటిడి చైర్మన్. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనలేదు. నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు. నేను రాజకీయాల విషయాలు మాట్లాడను అని చెప్పాను. కానీ ఒక మీడియా ప్రతినిది ఒత్తిడి తెస్తే ఆ విషయం మాట్లాడాను. సీఎం జగన్ ఈనెల 23న పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు వస్తున్న సందర్భంలో డిక్లరేషన్ ఇస్తారా అన్న సందర్భంలో వివరణ మాత్రమే ఇచ్చాను. గతంలో సీఎం రాజశేఖరరెడ్డి, సోనియాగాంధీ కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టే జగన్ కి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాను. రాష్ట్ర ప్రజలందరి తరఫున వచ్చే వ్యక్తి కి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నాను. టీటీడీ యాక్ట్ రూల్ 136 ప్రకారం స్వామి దర్శనానికి హిందువులు మాత్రమే అర్హులని చెబువుతోంది. రూల్ 137 ప్రకారం హిందువులు కానివారు ఎవరైనా స్వయంగా వారే స్వయంగా వచ్చి డిక్లరేషన్ ఇవ్వాలని చెబుతోంది. ఇలా కానీ పక్షంలో దర్సనానికి టికెట్ల కోసం వచ్చినపుడు వారి పేర్లు మహ్మద్, యేసయ్య లాంటి పేర్లు ఉంటే వారిని డిక్లరేషన్ అడగొచ్చు. ఒంటిపై వారి మతానికి సంబంధించిన గుర్తులు, పచ్చ బొట్లు లాంటివి ఉంటే వారిని డిక్లరేషన్ అడగాలి. 2014లో టీడీపీ ప్రభుత్వం సర్క్యులర్ లో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. . బ్రహ్మోత్సవాల వేళ ఇలాంటి వివాదాలు వద్దు.
  • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి  లేఖ రాసిన మంత్రి కేటీఆర్. కేంద్రం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన సుమారు 1434 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని కోరిన మంత్రి కేటీఆర్. 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలపై సవివరమైన లేఖ. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరినా కేటీఆర్. 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన 208 కోట్ల బేసిక్ గ్రాంట్, 442 కోట్ల పర్ఫామెన్స్ గ్రాంట్ బకాయిలు ఉన్న కేంద్రం. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి హైదరాబాద్ కి రావాల్సిన 421 కోట్లు, ఇతర పట్టణ స్థానిక సంస్థల కు రావలసిన 315 కోట్లు వెంటనే చెల్లించాలని కోరినా కేటీఆర్.
  • వైద్య విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్రం మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు 3 నెలలజిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాల్సిందిగా ఉతర్వులు జారి తమ వైద్య సేవల కు ఈ అనుభవం తొడుకావాలి అని అభిప్రాయం వ్యక్తి చేసిన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పీజీ లు జిల్లాల్లో పనిచేయటం వల్ల ఆయా జిల్లాల్లో మౌలిక వసతులు ఏర్పడతాయని గజేట్ లో తెలిపిన imc
  • విశాఖ: పవన్ సాయి మృతిపై అనుమానాలు. ఘటనపై అనుమానాలున్నాయంటున్న పవన్ సాయి కుటుంబ సభ్యులు. పార్టీకి వెళ్ళిన వారితో పాటు రిసార్ట్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలణ్టున్న బణ్ధువులు. ఘాటనా స్థలం నుంచి ఆసుపత్రికి పవన్ సాయిని తరలించిన స్నేహితులు. అక్కడ నుంచి ఇంటికి తరలింపు. ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టు పవన్ సాయి కుటుంబానికి చెప్పని స్నేహితులు. విషయం తెలియక హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళిన బంధువులు. అప్పటికే మృతిచెందినట్యు నిర్ధారిణ్చిన వైద్యులు. కోవిడ్ సమయంలో రిసార్ట్స్ తెరవడంపై ఆందోళన.. యువకుకకు ఎలా అనుమతిచ్చారంటున్న మృతుడి బంధువులు.

సీరం కంపెనీకి డ్రగ్స్ రెగ్యులేటర్ షో కాజ్ నోటీసు

'కోవిషీల్డ్స్' వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తున్న పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ ట్రబుల్స్ లో పడింది. ఈ వ్యాక్సీన్ ట్రయల్స్ లో ఈ సంస్థ ముందడుగు వేస్తున్నప్పటికీ.. ట్రయల్స్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రిటన్ లో దీనిని
serum institute gets notice on pausing vaccine trial, సీరం కంపెనీకి డ్రగ్స్ రెగ్యులేటర్ షో కాజ్ నోటీసు

‘కోవిషీల్డ్స్’ వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తున్న పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ ట్రబుల్స్ లో పడింది. ఈ వ్యాక్సీన్ ట్రయల్స్ లో ఈ సంస్థ ముందడుగు వేస్తున్నప్పటికీ.. ట్రయల్స్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రిటన్ లో దీనిని తీసుకున్న వాలంటీర్ (రోగి) కి ఈ విషయాన్ని ఎందుకు తెలియజేయలేదని డ్రగ్స్ రెగ్యులేటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ సంస్థకు షో కాజ్ నోటీసు జారీ చేసింది. సీరం కంపెనీ ఇండియాలో వచ్ఛే వారం నుంచి మూడో దశ ట్రయల్స్ ని ప్రారంభించనుంది. బ్రిటన్లోని ఈ రోగికి  సైడ్ ఎఫెక్ట్స్ సోకి అస్వస్థత పాలవడంతో నాలుగు దేశాల్లో ట్రయల్స్ ని నిలిపివేశారు. అయితే ఈ వ్యాక్సీన్ కి. ఆ పేషంట్ సైడ్ ఎఫెక్ట్స్ కి లింక్ ఉందా అన్న విషయం తేలాల్సి ఉంది.

ఈ రోగికి మీరు వివరణాత్మక రిపోర్టు ఎందుకు పంపలేదని డ్రగ్స్ రెగ్యులేటర్ సంస్థ సీరం కంపెనీని ప్రశ్నించింది. అయితే ఇండియాలో తమ ట్రయల్స్ కొనసాగుతున్నాయని, ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదని సీరం సంస్థ తెలిపింది. బ్రిటన్ ట్రయల్స్ పై తాము కామెంట్ చేయబోమని పేర్కొంది. ఇలా ఉండగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సీన్ ఉత్పత్తికి పూనుకొన్న బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా.. ఆస్ట్రాజెనికా.. ఆ పేషంట్ అకస్మాత్తుగా అస్వస్థత పాలయ్యాడని. డ్రగ్ ట్రయల్స్ లో ఇలాంటివి మామూలేనని కొట్టి పారేసింది.

 

Related Tags