సీరం వ్యాక్సీన్ కి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

దేశంలో వలంటీర్ల కు ఆక్స్ ఫర్డ్ కోవిడ్ 19 వ్యాక్సీన్  క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ కి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ (డీసీజీఐ) అనుమతించింది. రెండు , మూడో దశ కొత్త ట్రయల్ రిక్రూట్ మెంట్ కు అనుమతిని నిలిపివేస్తూ..

సీరం వ్యాక్సీన్ కి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2020 | 10:10 AM

దేశంలో వలంటీర్ల కు ఆక్స్ ఫర్డ్ కోవిడ్ 19 వ్యాక్సీన్  క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ కి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ (డీసీజీఐ) అనుమతించింది. రెండు , మూడో దశ కొత్త ట్రయల్ రిక్రూట్ మెంట్ కు అనుమతిని నిలిపివేస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను డీసీజీఐ ఉన్నతాధికారి డాక్టర్ సోమానీ రద్దు చేశారు. అయితే కొన్ని షరతులపై తిరిగి అనుమతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వలంటీర్ల నుంచి ముందే పర్మిషన్ తీసుకోవలసి ఉంటుందని, స్క్రీనింగ్ సందర్బంలో అదనపు సమాచారాన్ని కూడా సేకరించాలని, వ్యతిరేక ఫలితాలు వచ్చిన పక్షంలో వాటిని స్టడీ చేయాలని సూచించారు. ఈ విధమైన ఫలితాలు వచ్చిన ప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వ్యాక్సీన్ తయారీకి వినియోగించిన మెడికేషన్ వివరాలను తమకు సమర్పించాలని కూడా కోరారు. ఇతర దేశాల్లో అస్త్రాజెనికా క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో.. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ రెండు, మూడు దశల ట్రయల్స్ ను కూడా ఆపాలని ఈ నెల 11 న డీసీజీఐ ఆదేశించింది.