Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో పంచాయతీ సెక్రెటరీ కళ్యాణ్.. ట్రైన్ కింద పడి ఆత్మహత్య. గత కొద్దిరోజుల క్రితం.. ఇతని కూతుర్ని.. ఘట్కేసర్ లో ఒకతను గొంతుకోసి చంపటం జరిగింది.
  • హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ నిర్వాకం. అధిక రెట్ ల తో సినిమా టికెట్ల విక్రయం. సినిమా టికెట్ ల పై 10 శాతం అధికంగా . జీ ఎస్టీ ఛార్జ్ వసూలు. 18 శాతం కు బదులు 28 శాతం టాక్స్ విధించి టికెట్ విక్రయం పై 30 లక్షలు ఆదాయం. జి ఎస్టీ అధికారులకు గతం లో పలు ఫిర్యాదులు.
  • సౌందర్యంతోపాటు సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి. పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై మరింతగా దృష్టిపెట్టాలి. భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలి. నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం (అర్కిటెక్చర్) కూడా ఒకటి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలి. ఐఐఏ జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • కోవిడ్-19పై ప్రధాని సమీక్షా సమావేశం. భేటీలో ఆరోగ్యశాఖ మంత్రితో పాటు హోంమంత్రి. కోవిడ్-19 తాజా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై చర్చ.
  • టీవీ9 మేయర్ బొంతు రామ్మోహన్: సచివాలయ కూల్చివేతలు సందర్భంగా పర్యావరణానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కూల్చివేత లకు జిహెచ్ఎంసి నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి. భారీ స్థాయిలో వచ్చే శిధిలాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టపోతున్నాం... కొన్ని వందల లారీల్లో శిథిలాలను జీడిమెట్ల లోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కి తరలిస్తారు. రాత్రి సమయంలో మాత్రమే శిథిలాల తరలింపును చేపడతాం. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, రోడ్లు పాడవకుండా అన్ని జాగ్రత్తలు ఇలా తరలింపులో తీసుకుంటాం.. సచివాలయ శిథిలాల నుంచి కంకర, ఐరన్, డస్ట్ వేరుచేస్తారు.
  • నల్లకుం లోని పీహెచ్సీ సెంటర్, లాలాగూడ లోని రైల్వే హాస్పిటల్ కరోనా టెస్టింగ్ సెంటర్లను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కరోనా టెస్ట్ లు జరుగుతోన్న తీరు, వైద్య సిబ్బంది జాగ్రత్తలపై వివరాలను ఆరా తీసిన కేంద్రమంత్రి. కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.

నీ సుత్తి సలహాలు ఆపు..నాకు కరోనా వచ్చేలా చెయ్యి

వర్మ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌కు సంబంధించి రకరకాల ట్వీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వర్మ చేసిన మరో ట్విట్...‘అరే కేఏ పాలు..ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు
ram gopal varma satirical tweet on ka paul, నీ సుత్తి సలహాలు ఆపు..నాకు కరోనా వచ్చేలా చెయ్యి

సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ…ఎపుడూ ఏదో రకంగా వార్తల్లోకెక్కటం తన తర్వాతే ఎవరైనా. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడటం దాన్ని వివాదాస్పదం చేయడం వర్మ నుంచే చూసి నేర్చుకోవాలి. అంతేకాదు తనకు గిట్టని వాళ్లపై ఏదో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు ముందు నుంచి అలవాటు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్లో ట్వీట్లు పెడుతున్నారు. రకరకాల డౌట్లు వేస్తూ అందర్నీ ప్రశ్నిస్తున్నారు. ఈసారి వర్మ కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టారు.

వర్మ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌కు సంబంధించి రకరకాల ట్వీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వర్మ చేసిన మరో ట్విట్…‘అరే కేఏ పాలు..ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బరావు’. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేట్లు చేయి ఎంకమ్మ’ అని కేఏ పాల్‌పై సెటైర్లు వేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దీంతో వర్మ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎంలు వైరస్ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణకు క్వారంటైన్ సెంటర్ల అవసరం ఏర్పడుతున్న వేళ రాజకీయ నాయకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తన వంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణలోని తమ సంస్థకు ఉన్న చారిటీ గదుల్ని క్వారంటైన్ సెంటర్లుగా వాడుకోమన్నారు.

Related Tags