తెలంగాణలో రాగల మూడు రోజుల్లో.. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు..

నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే వచ్చినా, వర్షాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజుల్లో.. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు..
Follow us

| Edited By:

Updated on: Jun 24, 2020 | 5:54 PM

Rain likely to be in Telangana: నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే వచ్చినా, వర్షాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల నుండి 3.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 2.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.