అమేథీ నుంచి రాహుల్‌ నామినేషన్‌

అమేథీ: ఉత్తరప్రదేశ్‌ అమేథీ స్థానం నుంచి  పోటీ చేస్తున్న ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్‌ గాంధీ బుధవారం తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ ఉదయం అమేథీ చేరుకున్న రాహుల్‌.. నామినేషన్‌కు ముందు భారీ  రోడ్‌ షో నిర్వహించారు. రాహుల్ వెంట ఆయన సోదరి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్‌ వాద్రాతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మాత్రం  నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. 2004 […]

అమేథీ నుంచి రాహుల్‌ నామినేషన్‌
Follow us

|

Updated on: Apr 10, 2019 | 2:05 PM

అమేథీ: ఉత్తరప్రదేశ్‌ అమేథీ స్థానం నుంచి  పోటీ చేస్తున్న ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్‌ గాంధీ బుధవారం తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ ఉదయం అమేథీ చేరుకున్న రాహుల్‌.. నామినేషన్‌కు ముందు భారీ  రోడ్‌ షో నిర్వహించారు. రాహుల్ వెంట ఆయన సోదరి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్‌ వాద్రాతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మాత్రం  నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు.

2004 నుంచి రాహుల్‌ అమేథీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమేథి నుండి ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించిన రాహుల్ గాంధీ మరోసారి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. ఈ స్థానమే కాకుండా కేరళలోని వాయనాడ్ స్థానం నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు.  అమేథీ పోరుకు ఎస్పీ-బీఎస్పీ కూటమి దూరంగా ఉండటంతో వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.