హృదయాలను కలచివేస్తోన్న జవాన్ల కుటుంబ పరిస్థితి

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన 42 మంది జవాన్ల కుటుంబాల పరిస్థితి హృదయాలను కలచివేసేదిగా ఉంది. కొడుకును కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు, తోడబుట్టిన వాడిని కోల్పోయిన రక్త సంబంధీకులు ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో పరిస్థితి. దేశం మొత్తం జవాన్ల వీర మరణానికి ద్రిగ్భాంతిని వ్యక్తం చేస్తుంటే వాళ్ల కుటుంబీకులు మాత్రం శోక సంద్రంలో మునిగిపోయారు. రెండు నెలల పాటు సెలవలకు సరదాగా గడిపిన అనంతరం మళ్లీ […]

హృదయాలను కలచివేస్తోన్న జవాన్ల కుటుంబ పరిస్థితి
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:04 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన 42 మంది జవాన్ల కుటుంబాల పరిస్థితి హృదయాలను కలచివేసేదిగా ఉంది. కొడుకును కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు, తోడబుట్టిన వాడిని కోల్పోయిన రక్త సంబంధీకులు ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో పరిస్థితి. దేశం మొత్తం జవాన్ల వీర మరణానికి ద్రిగ్భాంతిని వ్యక్తం చేస్తుంటే వాళ్ల కుటుంబీకులు మాత్రం శోక సంద్రంలో మునిగిపోయారు.

రెండు నెలల పాటు సెలవలకు సరదాగా గడిపిన అనంతరం మళ్లీ విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన వెంటనే చేదు వార్త అందటంతో కన్నీరు మున్నీరవుతున్నారు. హోలీకి మళ్లీ తిరిగొస్తానమ్మా అని చెప్పి వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల బబ్లూ సంత్రాను తలుచుకుంటూ తల్లి శోకిస్తోంది.

ఒడిశాకు చెందిన ప్రసన్న కుమార్ కూతురు రోజీ స్పందిస్తూ తన తండ్రి చనిపోయినందుకు బాధగా ఉందని, మరోపక్క దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వంగా కూడా ఉందని చెప్పింది. చనిపోవడానికి కొద్దిసేపటి క్రితమే ఒడిశాకు చెందిన 33 ఏళ్ల మనోజ్ తన ఇంటికి ఫోన్ చేశారు. కూతురు బాగోగుల గురించి అడిగిన అనంతరం శ్రీనగర్‌కు వెళుతున్నామని మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ఆ కుటుంబం రోదిస్తోంది.