10 మంది ఓటర్ల కోసం 18 కి.మీ అరణ్య బాట.. పోలింగ్ అధికారుల సాహసం..

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కోసం కేరళలోని గిరిజన గ్రామంలో పర్యటించారు పోలింగ్ అధికారులు. 92 ఏళ్ల శివలింగం అనే వృద్ద ఓటరు కోసం దాదాపు 18 కిలోమీట్లరు ప్రయాణించారు. దట్టమైన కొండలు, గుట్టలు, చెరువులు, వాగులు దాటుకుంటూ ఆ ఓటరు వద్దకు చేరుకున్నారు. కేరళలోని ఇడుక్కి ప్రాంతం ఎడమలక్కుడిలో అనారోగ్యం బారినపడిన వృద్దుని కోసం ముగ్గురు మహిళా అధికారులు ఈ సాహసానికి పాల్పడ్డారు.

10 మంది ఓటర్ల కోసం 18 కి.మీ అరణ్య బాట.. పోలింగ్ అధికారుల సాహసం..
Kerala Polling
Follow us

|

Updated on: Apr 20, 2024 | 1:37 PM

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కోసం కేరళలోని గిరిజన గ్రామంలో పర్యటించారు పోలింగ్ అధికారులు. 92 ఏళ్ల శివలింగం అనే వృద్ద ఓటరు కోసం దాదాపు 18 కిలోమీట్లరు ప్రయాణించారు. దట్టమైన కొండలు, గుట్టలు, చెరువులు, వాగులు దాటుకుంటూ ఆ ఓటరు వద్దకు చేరుకున్నారు. కేరళలోని ఇడుక్కి ప్రాంతం ఎడమలక్కుడిలో అనారోగ్యం బారినపడిన వృద్దుని కోసం ముగ్గురు మహిళా అధికారులు ఈ సాహసానికి పాల్పడ్డారు. క్రూరమృగాల ఉండే అడవిలో ప్రయాణం చేసి గొప్ప సాహసానికి పూనుకున్నారు.

దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ముగ్గురు మహిళలతో కూడిన తొమ్మిది మంది పోలింగ్ అధికారుల బృందం దట్టమైన అడవిలో 18 కిలోమీటర్ల పాదయాత్ర చేసి గిరిజన ఓటర్ల వద్దకు చేరుకున్నారు. ఈ గిరిజన గ్రామంలో నివసిస్తున్న 92 ఏళ్ల శివలింగం అనే వృద్ద ఓటరుకు ఓటు హక్కును వినియోగించుకోవాలిన ఉందని బూత్ లెవల్ అధికారి ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో జిల్లా ఎన్నికల విభాగం అతని దరఖాస్తును ఆమోదించి, ఆయన ఇంటి వద్ద ఒకే ఓటు నమోదు చేసేందుకు ఏర్పాట్లు సిద్దం చేసింది. మున్నార్ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరిన పోలింగ్ అధికారులు అత్యంత కష్టమైన, దట్టమైన అడవుల్లో రాళ్లు రప్పలను దాటుకంటూ మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్నారు.

ఈ గిరిజన కుగ్రామంలో ఒక గుడిసె కనిపించింది. దీంతో వారి ప్రయాణం సత్ఫలితాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ మరింత ముందుకు సాగారు. చివరకు ఈ దండకారణ్యంలో కేవలం 10 గిరిజన గుడిసెలు మాత్రమే ఉన్నాయి. అక్కడకు చేరకున్న పోలింగ్ అధికారులు స్థానికంగా ఉన్న గ్రామస్థుల చేత ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారు. ఓటింగ్ ప్రక్రియ ముగించుకుని ఎన్నికల అధికారుల తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో వృద్ద ఓటరు శివలింగం కన్నీరుమున్నీరుగా వీడ్కోలు పలికారు. దీనికి కారణం తన సంకల్పాన్ని పోలింగ్ అధికారులు గుర్తించి సాహసోపేతమైన కార్యానికి అడుగులు వేశారని భావించి కన్నీటి పర్యంతం అయినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ షీబా జార్జ్, సబ్-కలెక్టర్ VM జయకృష్ణన్ ఓ మీడియా ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles