‘వైసీపీ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తా. ప్రత్యేకించి ఎక్కడ నుండి పోటీ చేయాలని అనుకోవడం లేదు. జగన్ ఆదేశాలనుసారం పార్టీకి సేవచేస్తా’ అని ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జయసుధ తెలిపారు. ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థకు ఆమె పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేయడం విశేషం. ఏపీలో ఆ పదవికి టీడీపీ నేత అంబికా కృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే టీడీపీ తరుపున నామినేటెడ్ పోస్టులు వరుసగా ఖాళీ అవడంతో ఆయా స్థానాల్లో కీలకమైన ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు జయసుధ. గతంలో ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఉండటంతో పాటు వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేయడం.. ఇండస్ట్రీ పెద్దలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి జయసుధను నియమిస్తే సముచితంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే జయసుధతో పాటు మోహన్ బాబు, జీవిత, రాజశేఖర్‌లు నామినేటెడ్ పోస్ట్‌లు ఆశిస్తున్నవారిలో ఉన్నారు.