DGP warning గౌతమ్ సావంగ్ సీరియస్ వార్నింగ్

ఇంటర్ నెట్‌లో రెచ్చిపోతున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సావంగ్. మోబైల్ వుంది, అందులో ఇంటర్ నెట్ వుంది కదా.. అని తోచిన, వచ్చిన ప్రతీ అంశాన్ని నిజమో కాదో చూసుకోకుండా ఫార్వర్డ్ చేస్తూనో..

DGP warning గౌతమ్ సావంగ్ సీరియస్ వార్నింగ్
Follow us

|

Updated on: Apr 03, 2020 | 3:12 PM

AP DGP Gowtam Sawang warns negigens: ఇంటర్ నెట్‌లో రెచ్చిపోతున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సావంగ్. మోబైల్ వుంది, అందులో ఇంటర్ నెట్ వుంది కదా.. అని తోచిన, వచ్చిన ప్రతీ అంశాన్ని నిజమో కాదో చూసుకోకుండా ఫార్వర్డ్ చేస్తూనో.. పోస్ట్ చేస్తూనో వుంటే ఊరుకునేది లేదన్నారు పోలీస్ బాస్. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను వ్యాపింప చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శుక్రవారం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ రాష్ట్రంలోనికి వచ్చే ఇతర రాష్ట్రాల సరిహద్దులో వున్న చెక్ పోస్టుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో, చెక్ పోస్టు సిబ్బందితోను డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి వాహనాలను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారంటూ డీజీపీ వాకబు చేశారు. కరోనాను నివారించేందుకు ఏపీ పోలీసు శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు డీజీపీ. ఏపిలోని అన్ని చెక్ పోస్ట్ లలో ఉన్న పరిస్థితి గురించి తెలుసుకున్నానని, 24 గంటల పాటు పోలీసు సిబ్బంది చెక్ పోస్టుల వద్ద పహారా కాస్తున్నారని ఆయన తెలిపారు.

ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి అత్యవసర, నిత్యవసర వాహనాలను మినహా ఎవరిని అనుమతించడం లేదని, నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారిని ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగిందని, కరోనా ఉన్న వారికి భద్రత నడుమ చికిత్స నడుస్తోందని డీజీపీ వివరించారు. డాక్టర్లు, నర్సులు, ఏఎస్ఎమ్‌లు, ఆశా వర్కర్లు, వాలెంటీర్లు రిస్క్ తీసుకుని‌ ప్రజల కోసమే పని చేస్తున్నారని చెప్పారాయన? ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కోవిడ్‌‌-19 మీద సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలున్నాయని, అందుకే తప్పుడు వార్తలపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆయనంటున్నారు.