
గుడ్లలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అలాగే పెరుగు, పాలు కూడా తినవచ్చు. సోయాబీన్స్, బాదం, వాల్ నట్స్, హాజెల్ నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్.. వంటి ఆహారాల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

పీరియడ్స్ ముందు లేదా ఆ సమయంలో అధికంగా గ్యాస్ ఉత్పత్తి కావడం వల్ల అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా ప్రేగులలో సమస్యలు, కడుపులో గ్యాస్ ఏర్పడటం PMS సాధారణ లక్షణం. ఇది సాధారణంగా హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల సంభవిస్తుంది.

ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల ప్రేగులలో గ్యాస్, మలబద్ధకం, గ్యాస్ సమస్య ఏర్పడవచ్చు. ఇది పీరియడ్స్ సమయంలో ఉబ్బరం కలిగిస్తుంది. ఇంకా ప్రొజెస్టెరాన్ స్థాయిలు హెచ్చుతగ్గులు కూడా ప్రారంభమవుతాయి. శరీరంలో ఈ విధమైన హార్మోన్ల మార్పుల వల్ల గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.

గ్యాస్ సమస్యను తగ్గించుకోవడానికి ఈకింది చిట్కాలను ట్రై చేయవచ్చు. పీరియడ్స్ సమయంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. రోజుకు 2,300 mg కంటే ఎక్కువ తీసుకోకూడదు. సాధారణంగా కడుపుని చికాకు పెట్టే ఆహారాలను నివారించడం బెటర్. గ్యాస్‌ను విడుదల చేసే యోగా ఆసనాలను చేయడానికి ప్రయత్నించాలి.