డయాబెటిక్ పేషెంట్లు బెండకాయ తింటే మంచిదేనా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే!

|

Aug 27, 2024 | 9:28 AM

ఒకసారి మనిషిని షుగర్ వ్యాధి ఎటాక్‌ చేసిందంటే..అది ఇక వారిని ఎప్పటికీ విడిచిపెట్టదు. మందులేని ఈ వ్యాధిని నిర్మూలించలేము అదుపులో ఉంచుకోవటం తప్ప. అందుకే మధుమేహం బాధితులు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అధిక చక్కెర స్థాయిలు ప్రాణాంతక సమస్యలను కలిగిస్తాయి. అయితే మధుమేహం ఉన్నవారు బెండకాయ తినవచ్చా లేదా..? అన్నది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. అయితే, ఓక్రాగా పిలుచుకునే ఈ బెండకాయను డయాబెటీస్ ఉన్నవారు తినొచ్చా? తింటే కలిగే లాభనష్టాలేంటీ? ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
బెండకాయలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బెండకాయలో విటమిన్ ఎ, సి ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడంలో సహాయపడతాయి. మీ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా ఇందులో ఉంటుంది.

2 / 5
రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బెండకాయలు ఎంతగానో సహాయపడుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మీరు డయాబెటిక్ పేషంట్ అయితే మీ డయాబెటిస్‌ డైట్లో భాగంగా బెండకాయలను తీసుకోవచ్చు. బెండకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది వేగంగా పెరుగుతున్న చక్కెర శాతాన్ని కంట్రోల్‌ ఉంచుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

3 / 5
బెండకాయలో ఉండే ఫైబర్ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెండకాయలో ఉండే క్వెర్సెటిన్, కాటెచిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల కలిగే నష్టం నుంచి కాపాడతాయి. ఫలితంగా రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.

4 / 5
బెండకాయ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చక్కగా సహాయపడుతుంది. బెండకాయ గమ్మీ ఫుడ్ కాబట్టి, ఇది జీర్ణవ్యవస్థకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

5 / 5
ఉదయాన్నే బెండకాయ వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే షుగర్ సమస్యతో ఎప్పుడూ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది చర్మం పొడిబారడం, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెండకాయ నీటిలో ఉండే ఫినాలిక్ సన్ బర్న్ అయిన చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.