Fenugreek: మొలకెత్తిన ఈ మెంతులు తింటే రోగాలు రమ్మన్నా రావు..

|

Oct 24, 2024 | 5:41 PM

మెంతులను మనం వంటల్లోకి ఉపయోగిస్తూ ఉంటాం. మెంతులతో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలో మెంతులు ఎంతో చక్కగా పని చేస్తాయి. నానబెట్టిన మెంతుల నీరుతో చాలా లాభాలు ఉన్నాయి. అంతే కాకుండా మొలకెత్తిన విత్తనాలు తింటే ఊహించలేని బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన మెంతులను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ మెంతులు తింటే బీపీ, షుగర్‌ను..

1 / 5
మెంతులను మనం వంటల్లోకి ఉపయోగిస్తూ ఉంటాం. మెంతులతో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలో మెంతులు ఎంతో చక్కగా పని చేస్తాయి. నానబెట్టిన మెంతుల నీరుతో చాలా లాభాలు ఉన్నాయి. అంతే కాకుండా మొలకెత్తిన విత్తనాలు తింటే ఊహించలేని బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
పాలిచ్చే తల్లులు మొలకెత్తిన మెంతి గింజలను తినడం వల్ల ప్రయోజనం పొందుతారు.  రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, మొలకెత్తిన మెంతులు ప్రతిరోజూ తినాలి. శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మొలకెత్తిన మెంతులు కూడా తినాలి.

3 / 5
Sprouted Fenugreek

Sprouted Fenugreek

4 / 5
మొలకెత్తిన మెంతుల్లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని ఇది బలపరుస్తుంది. ఇవి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ల అసమతుల్యతను కాపాడతాయి. మెనోపాజ్‌తో బాధపడే మహిళలకు మొలకెత్తిన మెంతులు ఎంతో ఉపయోగకరం. ఈ మొలకెత్తిన మెంతుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దంతాలు, ఎముకులను బలోపేతం చేస్తాయి.

5 / 5
అంతేకాదు.. మొలకెత్తిన మెంతులు చర్మ సంక్రమణలను నివారించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని నిరోధించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన మెంతులు సహజంగా రక్తాన్ని శుభ్రపరుస్తాయి. రక్తంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. రక్తంలో ఉన్న అన్ని రకాల విషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.