నానమ్మల కాలం నాటి పుల్ల పుల్లగా ఉండే పుల్లట్లు.. ఇంట్లో బియ్యంతో ఇలా చేస్తే టేస్ట్ అదరహో

Updated on: May 14, 2026 | 10:44 AM

పాతకాలం వంటల్లో ఇప్పుడు చెప్పబోయే వంటకం పుల్లట్లు. అయితే, ఇది కొద్దిగా పుల్లటి రుచితో ఉంటుంది సాధారణ అట్టులానే ఉంటుంది. కానీ, బయటకు మాత్రం కరకరలాడుతూ ఉంటుంది. ఇంకా లోపల అయితే మెత్తగా స్పాంజి లాగా ఉంటుంది. ఈ పుల్లట్లు ఉదయం టిఫిన్ కు అద్భుతంగా ఉంటాయి.

1 / 5
పాతకాలం వంటల్లో ఇప్పుడు చెప్పబోయే వంటకం పుల్లట్లు. అయితే, ఇది కొద్దిగా పుల్లటి రుచితో ఉంటుంది సాధారణ అట్టులానే ఉంటుంది. కానీ, బయటకు మాత్రం కరకరలాడుతూ ఉంటుంది. ఇంకా లోపల అయితే మెత్తగా స్పాంజి లాగా ఉంటుంది. ఈ పుల్లట్లు ఉదయం టిఫిన్ కు అద్భుతంగా ఉంటాయి. తాతలు, నానమ్మలు సమయంలో వీటిని పిండిలో పులియబెట్టి తినేవాళ్లు.

2 / 5
పుల్లట్లకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం, అర కప్పు అటుకులు , అర టీ స్పూన్ మెంతులు, అర కప్పు పెరుగు , 
 రుచికి సరిపడా ఉప్పు,  అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి , అర టేబుల్ స్పూన్ జీలకర్ర ,  మూడు కరివేపాకు, 
ఇంకా నూనెను తీసుకోవాలి.

పుల్లట్లకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం, అర కప్పు అటుకులు , అర టీ స్పూన్ మెంతులు, అర కప్పు పెరుగు , రుచికి సరిపడా ఉప్పు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి , అర టేబుల్ స్పూన్ జీలకర్ర , మూడు కరివేపాకు, ఇంకా నూనెను తీసుకోవాలి.

3 / 5
ముందుగా బియ్యం తీసుకుని, మెంతులు కూడా కడిగి కనీసం 6 గంటల పాటు వీటిని నానబెట్టాలి. అలాగే, అటుకులను కూడా తీసుకుని  15 నిమిషాల ముందుగా నానబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు బియ్యం, అటుకులను తీసుకుని మెత్తగా గ్రైండ్చేసుకోవాలి. ఈ పిండిలో పెరుగు, తగినంత ఉప్పు కూడా వేసి రాత్రంతా కదిలించకుండా దీనిని పులియబెట్టాలి.

4 / 5

ఉదయం మీరు పిండి తీసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు  వేసి కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి  అది బాగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ రాసి, ఇప్పుడు పిండిని తీసుకుని దోశలాగా పోసి ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా బాగా కాల్చుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి.

5 / 5

పుల్లట్లు తినడం వలన లాభాలు: పులియబెట్టిన పిండితో చేసిన అట్లు కావడంతో జీర్ణక్రియకు ఎంతో మంచిది. అయితే, వీటిని ఉదయం తింటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. శరీరానికి తేలికగా ఉండి తిన్న కొద్దీ సేపటికే  జీర్ణమవుతుంది. మీ ఇంట్లో  పదార్థాలతోనే ఈ  హెల్తీ అండ్ సూపర్  బ్రేక్‌ఫాస్ట్ ను చేసుకుని తినొచ్చు.

Follow Us