
కొబ్బరికాయలు కొట్టేటప్పుడు కొన్నింటిలో లోపల తెల్లటి స్పాంజ్ లాగా ఉంటుంది. దీనినే కొబ్బరి పువ్వు అంటారు. ఇది చాలా స్వీట్ గా తినడానికి మంచిగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈడొచ్చిన అమ్మాయిలు అప్పుడప్పుడు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు.

కొబ్బరి పువ్వు వల్ల కలిగే లాభాలు: వయసు వచ్చిన అమ్మాయిల్లో హార్మోన్ల మార్పులు అధికంగా జరుగుతాయి. ఇక కొబ్బరి పువ్వులో ఉండే పోషకాలు హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. ఇంకా రక్తహీనత సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుంది. దీనిలో ఉండే ఐరన్ శరీరానికి శక్తిని పెంచి ఈ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది

ఎముకల బలానికి కూడా ఇవి తోడ్పడుతాయి. ఇంకా వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను ఇంకా బలంగా ఉండేలా చేస్తాయి. అలాగే, జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది.ఇంకా మలబద్ధకం సమస్యను ఇది తగ్గిస్తుంది.

శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది : ఇమ్యూనిటీ పవర్ ను కూడా ఇది పెంచుతుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో ఉంటాయి.చర్మం, జుట్టుకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఈ కొబ్బరి పువ్వులోని మంచి కొవ్వులు చర్మ సమస్యలను తగ్గించి జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది.

శరీరానికి పవర్ఫుల్ ఫుడ్‌గా పనిచేస్తుంది: ఇది శరీరానికి పవర్ఫుల్ ఫుడ్‌గా పనిచేస్తుంది. ఇంకా నీరసం తగ్గించి శక్తిని ఇస్తుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)