Face Glowing Tips: ఈ దీపావళికి ముఖం మెరిసి పోవాలంటే.. ఈ హోమ్‌మేడ్ చిట్కాలు బెస్ట్..

| Edited By: Shaik Madar Saheb

Oct 31, 2024 | 8:33 PM

అందరిలో కంటే అందంగా, స్పెషల్‌గా కనిపించాలని ఆడవారు అనుకుంటూ ఉంటారు. అందులోనూ పండుగలు వచ్చాయంటే.. మరింత అందంగా తయారవుతారు. మరి ఇలాంటి సమయంలో మీ ముఖం అందంగా మెరవాలంటే ఇలా చేయండి..

1 / 5
పండుగలు వచ్చాయంటే ఇంట్లో ఉండే హడావిడి మామూలుగా ఉండదు. పండగ పేరు చెప్పి ఆడవాళ్లకు మరింత పని ఉంటుంది. ఈ క్రమంలో అన్ని పనులు చేసి ముఖం డల్‌గా, నీరసంగా ఉంటుంది. కానీ ఈ చిట్కాలు ట్రై చేశారంటే.. ఈ దీపావళి పండక్కి మీ ముఖం మెరిసి పోవాల్సిందే.

2 / 5
అప్పటికప్పుడు ముఖంలో మంచి గ్లో కనిపించాలంటే.. ఈ కుంకుమ పువ్వు ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. కుంకుమ పువ్వులను రాత్రి పాలలో నానబెట్టండి. ఉదయాన్నే ఇందులో కొద్దిగా తేనె, శనగ పిండి కలపండి. ఈ ప్యాక్ ఓ పావుగంట ఉంచి.. గోరు వెచ్చటి నీటితో కడిగితే చర్మం మెరిసి పోతుంది.

3 / 5
పసుపుతో కూడా స్కిన్‌ని మెరిపించుకోవచ్చు. శనగ పండిలో కొద్దిగా పసుపు, తేనె, పెరుగు కలపండి. ఇదంతా చిక్కని పేస్టులా ఉండాలి. ఈ మిశ్రమాన్ని ఓ పది నిమిషాలు ముఖానికి అప్లై చేసి.. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. మంచి గ్లో వస్తుంది.

4 / 5
రోజ్ వాటర్‌తో కూడా మంచి గ్లో తెచ్చుకోవచ్చు. కొద్దిగా రోజ్ వాటర్‌ను ఓ గిన్నెలో వేసుకోండి. అందులో దూదిని ముంచి ముఖం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా గంటకు ఒకసారి చేస్తే.. ముఖం ఫ్రెష్‌గా, గ్లో తయారవుతుంది.

5 / 5
బాదం నూనెతో కూడా ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ముందు రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె రాసి సున్నితంగా మసాజ్ చేసుకోండి. ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.