Climate changes: ఈ శతాబ్ది చివరలో ఆ ఎడారి పచ్చగా మారుతుంది.. కారణాలు తెలిస్తే షాక్ తింటారు..

| Edited By: Ravi Kiran

Aug 19, 2023 | 12:51 PM

మానవ తప్పిదాలతో పెరిగిపోతున్న భూతాపం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులకు కారణమవుతోంది. వాతావరణ సమతౌల్యత దెబ్బతిని అతి భారీ వర్షాలు లేదా అనావృష్టి, అతి తీవ్ర తుఫానులు, అధిక వేడిగాలులు లేదా అతి శీతల గాలులు వంటి వైపరీత్యాలకు ఈ వాతావరణ మార్పులే (Climate Change) కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ మార్పులు అంతటా చేటే చేస్తాయా అంటే.. కాదు అని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో థార్ ఎడారి పచ్చగా మారనుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

1 / 10
థార్ ఎడారి పచ్చగా మారనుందని ప్రపంచంలో ఉన్న ఎడారులన్నీ పచ్చగా మారతాయని అనుకోవద్దు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎడారుల విస్తీర్ణం ప్రతియేటా పెరుగుతూ పోతోంది. కానీ థార్ ఎడారి అందుకు విరుద్ధంగా పచ్చదనం దిశగా అడుగులేస్తోంది. ఇందుకు కారణం రుతుపవనాల్లో మార్పులేనని వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు.

2 / 10
థార్ ఎడారి భారత్‌లోని రాజస్థాన్‌తో పాటు పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్సులలో కొంత భాగాన్ని కలిగి ఉంది. మొత్తం 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎడారి ప్రపంచంలోని ఎడారుల్లో 20వ స్థానంలో ఉండగా.. ఉష్ణమండల ఎడారుల్లో 9వ స్థానంలో ఉంది. అసలు వర్షపాతం లేకపోవడం లేదా అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతాలు ఎడారులుగా మారతాయన్న విషయం తెలిసిందే.

3 / 10
ఓవైపు సింధు నది, మరోవైపు గంగా మైదానం మధ్య విస్తరించిన థార్‍‌ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించిందని చరిత్రకారులు విశ్వసిస్తారు. పురాణేతిహాసాల్లో ప్రస్తావన కల్గిన సరస్వతి నది థార్ ఎడారి మీదుగా ప్రవహించి గుజరాత్‌లోని 'రణ్ ఆఫ్ కచ్' వద్ద సముద్రంలో కలిసేదని భావిస్తున్నారు. ఆ మేరకు పరిశోధనలు కూడా జరిగాయి. గతం సంగతి ఎలా ఉన్నా.. భవిష్యత్తు మాత్రం పచ్చగా ఉంటుందన్న వార్త ఆశ్చర్యంగా ఉన్నా ఆనందాన్ని కల్గిస్తోంది.

4 / 10
భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పరిశోధకుల అంచనాల ప్రకారం పెరుగుతున్న భూతాపం కారణంగా ప్రపంచంలోని వివిధ ఎడారుల విస్తీర్ణం పెరుగుతోంది. ఉదాహరణకు ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి 2050 నాటికి ప్రతియేటా 6,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని నిపుణులు అంచనా వేశారు. థార్ ఎడారిలో పరిస్థితులు గత శతాబ్దకాలంలో అందుకు విరుద్ధంగా ఉన్నాయి. 1901-2015 మధ్యకాలంలో నమోదైన వర్షపాతాన్ని విశ్లేషిస్తే.. ఈ ఎడారి ప్రాంతంలో 10 నుంచి 50% వరకు వర్షపాతం పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. కర్బన ఉద్గారాల విడుదల మితంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఎడారిలో వర్షపాతం 50 - 200 శాతం మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనంతటికీ కారణం భారతదేశానికి విస్తారంగా వర్షపాతాన్ని మోసుకొచ్చే రుతుపవనాలు తూర్పు వైపుగా దిశ మార్చుకోవడమేనని సూత్రీకరిస్తున్నారు.

5 / 10
ఆ కారణంగా దేశంలోని పశ్చిమ, వాయువ్య ప్రాంతాల్లో వర్షపాతం పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చారిత్రకంగా రుతుపవనాల కారణంగా కురిసే వర్షాలతోనే సింధు లోయ నాగరికత విలసిల్లిందని చరిత్రకారులతో పాటు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

6 / 10
రుతుపవనాలు సాధారణంగా భారతదేశంలో ద్వీపకల్ప ప్రాంతంతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో వర్షపాతాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ, వాయువ్య రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షపాతం మిగతా ప్రాంతాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఈ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. థార్ ఎడారి పచ్చగా మారుతుందని చెప్పేందుకు రుతుపవనాల గతిశీలతను అర్థం చేసుకోవడం కీలకమని గౌహతిలోని కాటన్ విశ్వవిద్యాలయం ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బీఎన్ గోస్వామి చెబుతున్నారు

7 / 10

హిందూ మహాసముద్రంలోని రెయిన్‌బ్యాండ్ కాలానుగుణంగా మార్పులకు లోనుకావడం లేదా భూమధ్య రేఖకు దక్షిణాన శీతాకాలంలో ఉండే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ వేసవిలో భారత భూభాగం దిశగా వేసవిలో విస్తరించడం వల్ల రుతుపవనాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్టు గోస్వామి తెలిపారు. హిందూ మహాసముద్రంలోని 'వార్మ్ వాటర్ పూల్' వాతావరణ మార్పుల కారణంగా పశ్చిమ దిశగా కదలడం వల్ల భారత్‌లోని పశ్చిమ, వాయువ్య ప్రాంతాలకు అధిక వర్షపాతాన్ని రుతుపవనాలు తీసుకొస్తున్నాయని అంచనా వేస్తున్నారు.

8 / 10
ఈ ప్రత్యేక, వైవిధ్య పరిస్థితులు భారత రుతుపవనాలకు మాత్రమే పరిమితమయ్యాయని, ఫలితంగా దేశ పశ్చిమభాగంలోని ఎడారి ప్రాంతాన్ని పచ్చగా మార్చేందుకు దోహదపడతాయని వివరించారు. అంతేకాదు, పెరుగుతున్న భారత దేశ జనాభా ఆహార అవసరాలను తీర్చే క్రమంలో ఈ మార్పులు సానుకూలంగా దోహదపడతాయని కూడా భావిస్తున్నారు.

9 / 10
మరోవైపు పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీకి చెందిన పీవీ రాజేశ్ దక్షిణాసియాలో వాతావరణంలో 50 ఏళ్లుగా చోటుచేసుకుంటున్న మార్పులను నమోదు చేశారు. దేశాలు అభివృద్ధి చెందే క్రమంలో పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, గ్రీన్ హౌజ్ వాయువులు, ఆ కారణంగా రుతుపవనాల్లో చోటుచేసుకుంటున్న మార్పుల డేటా ఆధారంగా రానున్న కాలంలో ఇంకా ఎలాంటి మార్పులకు ఆస్కారం ఉంటుందన్న విషయంపై దృష్టి పెట్టారు.

10 / 10
పశ్చిమ దిశగా రుతుపవనాలు విస్తరించడం వల్ల ఈశాన్య ప్రాంతాల్లో 10 శాతం వర్షపాతం తగ్గిందని, వాయువ్య ప్రాంతంలో 25 శాతం పెరిగిందని గుర్తించారు. ఇవి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లలో థార్ ఎడారి పచ్చగా మారడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. అయితే రుతపవానాల్లో మార్పులతో థార్ పచ్చగా మారడం శుభపరిణామమే కావొచ్చు, కానీ మిగతా ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడం కారణంగా తలెత్తే మార్పులు ఏ తరహా పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన కూడా నెలకొంది.