Galaxy F15 5G: రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్

|

Feb 26, 2024 | 10:57 PM

ప్రస్తుతం భారత్‌లో 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయ్‌ కూడా. దీంతో స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు సైతం 5జీ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌15 5జీ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

1 / 5
 దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌15 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్స్‌తో తీసుకొస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది.

2 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను మూడు కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ ఎస్వోసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని సమాచారం.

3 / 5
ఇక ఛార్జింగ్ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో నాలుగేండ్ల పాటు ఆండ్రాయిడ్, ఐదేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.

4 / 5
సామ్‌సంగ్‌ ఎఫ్15 5జీ ఫోన్ సింగిల్ చార్జింగ్‌తో రెండు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌ కెమెరా విషయానికొస్తే ఇందులో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్, సింగిల్ సెల్ఫీ షూటర్‌పై వాటర్ డ్రాప్‌స్టైల్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

5 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రత్యేకంగా వాయిస్‌ ఫోకస్‌ అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను ఇవ్వనున్నారు. దీంతో కాల్స్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ నాయిస్ తొలగించడానికి వీలు ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 15వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.