Xiaomi 14 Series: ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..

|

Feb 26, 2024 | 10:46 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం షావోమీ 14 సిరీస్‌పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. స్టన్నింగ్ లుక్‌, అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ లాంచింగ్‌ ఎప్పుడన్నదానిపై కస్టమర్లలో ఆసక్తినెలకొంది. అయితే తాజాగా ఈ ఎదురుచూపులకు చెక్‌ పెడుతూ ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు..

1 / 5
షావోమీ 14 సిరీస్‌ ఎట్టకేలకు లాంచ్‌ చేశారు. గ్లోబల్‌ మార్కెట్లో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ మార్చి 7వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. తొలి సేల్ ఎప్పటి నుంచి అన్న దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకోసం జర్మనీకి చెంది కెమెరా తయారీ సంస్థ లైకాతో షావోమీ భాగస్వామ్యమైంది. ఈ ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు.

3 / 5
షావోమీ 14 సిరీస్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేసే పలు అద్భుత ఫీచర్లను అందించనున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా షావోమీ 14, షావోమీ 14 అల్ట్రా పేరుతో ఈ రెండు ఫోన్‌లను లాంచ్‌ చేయనున్నారు.

4 / 5
 షావోమీ 14 అల్ట్రా ఫోన్‌లో 6.73 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇక షావోమీ 14 స్మార్ట్‌ ఫోన్‌లో 6.36 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తారు. 1.5 కే రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

5 / 5
 ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌లోనూ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. షావోమీ 14 ఫోన్‌లో 90 వాట్స్‌ హైపర్‌ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 4610 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. అలాగే 50 వాట్స్‌ వైర్‌లెస్‌ హైపర్‌ ఛార్జ్‌ టెక్నాలజీని అందించనున్నారు.  ఇక షావొమీ 14 అల్ట్రా ఫోన్‌ విషయానికొస్తే ఇందులో 90 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. 80 వాట్స్‌ వైర్‌లైస్‌ హైపర్‌ ఛార్జ్‌ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇదిలా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.