కడుపును క్లీన్ చేసే పుల్లటి యాపిల్ పచ్చడి.. ఇంకా చపాతీలు, దోశల్లోకి ఈ చట్నీ అదుర్స్

Updated on: May 19, 2026 | 3:12 PM

ఈ యాపిల్ పచ్చడి కడుపును శుభ్రపరుస్తుంది. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దోశ, చపాతీల్లోకి ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీనిలో బెల్లం ముక్కలు కలపడం వలన పులుపు, కారం బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. యాపిల్స్ ఉండే జీర్ణక్రియ పని తీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.

1 / 5
పుల్లటి యాపిల్ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: మూడు పచ్చ యాపిల్స్, 100 గ్రాముల పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 
6 వెల్లుల్లి రెబ్బలు , చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు , రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక చిన్న బెల్లం ముక్క, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

పుల్లటి యాపిల్ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: మూడు పచ్చ యాపిల్స్, 100 గ్రాముల పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు , చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు , రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న బెల్లం ముక్క, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

2 / 5

పుల్లటి యాపిల్ పచ్చడికి తయారీ విధానం: ముందుగా యాపిల్స్‌ను తీసుకుని వాటిని బాగా కడిగి  చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇంకా ఆ తరవాత పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, దానిలో నాలుగు పచ్చిమిర్చి, నాలుగు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు  కూడా బాగా వేయించి తీసుకోవాలి. మళ్ళీ అదే పాన్‌లో గ్రీన్ యాపిల్ ముక్కలు వేసి పచ్చి వాసన పోయేవరకు మగ్గించాలి.

3 / 5
ఇక ఇప్పుడు కొద్దిగా చింతపండు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్  పసుపు, ఇంకా  బెల్లం కూడా మెత్తగా అయ్యే వరకు వీటిని బాగా ఉడికించాలి. ఈ యాపిల్  మిశ్రమం  చల్లారిన తర్వాత మిక్సీలో వీటిని వేసి  మెత్తగా పట్టుకోవాలి. చివర్లో తాలింపు కోసం పాన్‌లో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఆకులు వేసి దీని మీద పోయాలి.

4 / 5
ఈ యాపిల్ పచ్చడి కడుపును శుభ్ర పరుస్తుంది. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దోశ, చపాతీల్లోకి ఈ పచ్చడి అద్భుతంగా  ఉంటుంది. ఇంకా దీనిలో బెల్లం ముక్కలు కలపడం వలన పులుపు, కారం బ్యాలెన్స్ అయ్యి  మంచి టేస్ట్ వస్తుంది. యాపిల్స్ ఉండే  జీర్ణక్రియ పని తీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.

5 / 5
ఇక్కడ చెప్పిన రెసిపీ ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us