చంకల దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్‌ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి!

Updated on: Aug 11, 2026 | 9:00 PM

వేసవిలో లేదా ఎక్కువ సమయం పనిచేసినప్పుడు చంకల్లో విపరీతంగా చెమట పట్టి దుర్వాసన రావడం చాలా సాధారణ సమస్య. ఈ దుర్వాసనను కవర్ చేయడానికి మార్కెట్లో లభించే రకరకాల డియోడరెంట్లను వాడినప్పటికీ, వాటి ప్రభావం కొంతసేపు మాత్రమే ఉంటుంది. పైగా అందులో ఉండే కెమికల్స్ చర్మాన్ని నల్లగా మార్చే ప్రమాదం ఉంది. చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియాని నివారించి, చంకలను శుభ్రం, తాజాగా ఉంచడానికి సహాయపడే కొన్ని అద్భుతమైన సహజ నివారణలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
బంగాళాదుంప రసం: బంగాళాదుంపలు చంకల కింద దుర్వాసనను తొలగించడంలో, చర్మ రంగును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. బంగాళాదుంపను తొక్క తీసి తురుముకుని, దాని నుండి రసాన్ని పిండాలి. ఒక దూది సహాయంతో ఈ రసాన్ని చంకలకు అప్లై చేసి, అరగంట పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి.

2 / 5
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ చర్మంపై బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని చంకలకు రాసి 15 నుండి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి, ఆపై స్నానం చేయాలి. ఇది దుర్వాసనను తగ్గించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

3 / 5
కలబంద జెల్: అలోవెరాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దుర్వాసనకు కారణమయ్యే క్రిములను సంహరిస్తాయి. తాజా కలబంద జెల్‌ను చంకలపై రాసి 20 నుండి 25 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. రోజుకు రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు యాంటీబ్యాక్టీరియల్ సబ్బుతో చంకలను శుభ్రం చేసుకోవాలి.

4 / 5
బేకింగ్ సోడా, నిమ్మరసం: బేకింగ్ సోడా చర్మంలోని పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేసి, చెమట వాసనను పీల్చుకుంటుంది. 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దీనిని చంకలకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.

5 / 5
టమాటా, నిమ్మరసం: టమాటాలో ఉండే సహజసిద్ధమైన యాంటీసెప్టిక్ గుణాలు దుర్వాసనను అరికడతాయి. టమాటా రసంలో 2 నుండి 3 చుక్కల నిమ్మరసం కలిపి దూదితో చంకలకు అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత నీటితో కడిగితే అండర్ ఆర్మ్స్ రోజంతా తాజాగా ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us