AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: శనీశ్వరుడి కటాక్షం.. ఇక ఆ రాశుల వారికి దశ తిరిగే ఛాన్స్..!

Lord Shani Dev: మే 17 నుంచి అక్టోబర్ 8 వరకు శని గ్రహం రేవతి నక్షత్రంలో సంచరించనుండటంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 09, 2026 | 5:52 PM

Share
ఈ నెల(మే) 17వ తేదీ నుంచి అక్టోబర్ 8 వరకు శనీశ్వరుడు తన మిత్రుడైన బుధుడికి చెందిన రేవతి నక్షత్రంలో సంచారం చేయడం జరుగుతుంది. బుధుడు అనుకూలంగా ఉన్న రాశులకు దీనివల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడం, షేర్లు లాభించడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం, ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి. ఈ నెల 16న వచ్చే శని అమావాస్య నుంచి వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారికి దశ తిరిగే అవకాశం ఉంది.

1 / 7
వృషభం: ఈ రాశికి ధన, పంచమాధిపతిగా అత్యంత శుభుడైన బుధుడి నక్షత్రం రేవతిలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారి జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఆస్తి, ఆర్థిక వివాదాలు అనుకూలంగా సమసిపోతాయి.

2 / 7
మిథునం: రాశ్యధిపతి బుధుడికి చెందిన రేవతి నక్షత్రంలో శని ప్రవేశం వల్ల ఈ రాశివారి సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. ఆశించిన పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యాపార రంగంలో అడుగు పెట్ట దలచుకున్నవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది.

3 / 7
సింహం: ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన బుధుడి నక్షత్రంలోకి శని ప్రవేశించడం వల్ల ఈ రాశివారి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. కొద్దిగా అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ జీవితం సుఖశాంతులతో పురోగతి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఈ నెల 17 తర్వాత నుంచి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనా రోగ్య, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.

4 / 7
కన్య: రాశ్యధిపతి బుధుడికి చెందిన రేవతి నక్షత్రంలో శని సంచారం వల్ల ఈ రాశివారి కెరీర్ సానుకూల మలుపులు తిరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.

5 / 7
తుల: భాగ్యాధిపతి అయిన బుధుడి నక్షత్రంలో శని సంచారం చేస్తున్నంత కాలం ఈ రాశివారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారమవు తాయి. కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభంతో పాటు, ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలను ఇవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆధ్మాత్మిక చింతన పెరిగి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

6 / 7
ధనుస్సు: ఈ రాశికి సప్తమ, దశమాధిపతి అయిన బుధుడి నక్షత్రంలో శని ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని  దోషం చాలావరకు తగ్గిపోతుంది. ఆశించిన పురోగతికి మార్గం సుగమం అవుతుంది. ఆర్థిక, కుటుంబ, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. సామాజికంగా హోదా, స్థాయి లభిస్తాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది.

7 / 7
Follow Us