AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక వీరికి తిరుగులేదు.. గురువు అనుగ్రహంతో జీవితంలో భారీ మార్పులు!

Jupiter Transit 2026: జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరించనుండటంతో కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. పెండింగ్‌లో ఉన్న శుభకార్యాలు పూర్తవడం, ఉద్యోగ అవకాశాలు లభించడం, ఆదాయం పెరగడం, వివాహ యోగాలు కలగడం, సంతాన ప్రాప్తి వంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ గురు సంచారం (Guru Gochar 2026) విశేష ఫలితాలను అందించనుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2026 | 12:05 PM

Share
శుభ కార్యాలకు, శుభ పరిణామాలకు కారకుడైన గురువు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల కొందరి జీవితాల్లో శుభ వార్తలు, శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న శుభ కార్యాలు తప్పకుండా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొన్ని రాశుల వారి జీవితాల్లో ఎక్కువగా శుభ ఫలితాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారి దశ ఈ విషయంలో తిరగబోతోంది.

1 / 9
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా గృహ, వాహనాలు కలుగుతాయి. సొంత ఇంటికి సంబంధించి ఈ రాశివారు చాలా కాలంగా కంటున్న కలలు సాకారమవుతాయి. కొద్దిగానైనా ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకోగలుగుతారు. శంకుస్థాపన, గృహ ప్రవేశం వంటివే కాక, ఇంట్లో పెళ్లి, తదితర శుభ కార్యాలు ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంది. వీరికి ఎక్కువగా శుభవార్తలే అందుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

2 / 9
మిథునం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఈ రాశివారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. బాగా డబ్బు కలిసి రావడంతో పాటు ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు వృద్ధిలోకి వస్తారు. సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ఆశించిన విదేశీ సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

3 / 9
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కూడా ఏర్పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసు లోని కోరికలు, చాలా కాలంగా కంటున్న కలలు చాలావరకు సాకారం అవుతాయి. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమై మానసికంగా ఊరట కలుగుతుంది. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

4 / 9
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల సాధారణ జీవితం నుంచి సంపన్న జీవితానికి అవకాశం ఉంది. గురు బలం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. చాలాకాలంగా పీడిస్తున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. తప్పకుండా స్వగృహ యోగం పడుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

5 / 9
తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అన్ని విధాలుగానూ అదృష్టవంతులవుతారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడతాయి.  ఒకటి రెండు ముఖ్యమైన శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు కలిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది.

6 / 9
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఈ రాశి వారి చిరకాల వాంఛ నిజమవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభ వార్త వింటారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

7 / 9
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా సప్తమ స్థానం పెళ్లి, ప్రేమలు, విదేశీయానం వంటి అంశాలకు సంబంధించిన స్థానమైనందువల్ల ఆశించిన పెళ్లి సంబంధం కుదరడం, ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధించడం, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరడం వంటివి జరిగే అవకాశం ఉంది. గురువు అనుకూలత వల్ల వీరి జీవితం అన్ని విధాలు ఉన్నత స్థితికి చేరుతుంది.

8 / 9
మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితికి రావడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. పిల్లల్లో ఒకరు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగపరంగా విదేశాల్లో స్థిరపడే అవకాశం కలుగుతుంది. రాజ పూజ్యాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో సంపన్నుడయ్యే అవకాశం ఉంది. రావలసిన డబ్బుతో పాటు రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆస్తిపరులయ్యే అవకాశం ఉంది.

9 / 9
Follow Us