
మీ బిడ్డ మాట్లాడే విధానం తన మెమరీ పవర్‌ను తెలియజేస్తుంది. పదాలను ఎలా గ్రహిస్తున్నాడు, స్పష్టంగా పలుకుతున్నాడా లేదా? ఒక పదం మీరే పదే పదే చెప్పాల్సి వస్తుందా ? అనేది గమనించాలి. వాక్యాలను త్వరగా పలకడం, వేగంగా మాట్లాడితే వారికి ఐక్యూ ఉన్నట్లే, అలాగే మీరు చేసే పనులను అనుకరిస్తున్నా కూడా వారికి అధిక ఐక్యూకి ఒక సంకేతం.

అంతే కాకుండా చాలా తెలివైన పిల్లలు ప్రతీ విషయం గురించి ప్రశ్నిస్తుంటారు. ముఖ్యంగా కుళాయి నుంచి నీరు ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది. ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఎలా తిరుగుతుంది. ఇలాంటి ప్రశ్నలు అడిగితే చాలా మంది విసిగిపోతారు. కానీ ఇది వారికి తెలివికి నిదర్శనం.

అలాగే మీ పిల్లలు ఒక చోట ఉండి, ఆ ప్రదేశంపై ఇష్టం పెంచుకోవడం. అక్కడ ఆడుకోవడానికి ఆసక్తి చూడం, అలాగే జోకులకు నవ్వడం, కోపం వస్తే అలగడం ఇలా ప్రతీదానికి స్పందిస్తున్నారు అంటే వారికి మంచి ఐక్యూ ఉన్నట్లే. అంతే కాకుండా చాలా మంది పిల్లలు ఈ రోజు చెప్పింది రేపు మర్చిపోతారు. కానీ మీ పిల్లలు దానిని గుర్తు పెట్టుకొని మరసటి రోజు చెబుతున్నారు అంటే వారికి చాలా తెలివి ఉన్నదని అర్థం.

అయితే కొంత మంది పిల్లల్లో ఐక్యూ ఉండదు. వారిలో తెలివిని ఎలా పెంచాలి అంటే? పిల్లల ముందు దుర్బాషలాడటం చేయకూడదు. కొట్టడం వంటిది చేయకూడదు. వారికి సంగీత వాయిద్యం నేర్పించాలి. గిటార్, హార్మోనియం వంటివాటిపై నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి.అలాగే పిల్లల మెదడుకు పని పెట్టే ఆటలు ఆడించాలి. దీని వలన పిల్లల్లో ఉత్సాహం, ఐక్యూ స్థాయిని పెంచుతాయి. శారీరక అభివృద్ధి కూడా జరుగుతుంది. ఆటలు ఆడించడం, చదరంగం, చిన్న చిన్న గేమ్స్ ఆడిపించడం చేయాలి. ముఖ్యంగా కూడిక తీసివేతలను సరదాగా ఎలా పరిష్కరించాలో తెలియజేయాలి.

కొన్ని వస్తువులను చూపించి వాటి గురించి వివరిస్తూ చెప్పాలి. మళ్ల వారిని వాటి గురించి చెప్పమనాలి. ప్రతి రోజూ ధ్యానం చేయడం నేర్పించాలి. ఎందుకంటే? ఇది ఒత్తిడిని తగ్గించి, సానుకూల ఆలోచనలు పెంచుతుంది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఫుడ్ అందించాలి.