విపరీత వేడితో ఉక్కిరి బిక్కిరి అయ్యే వాళ్ళు.. ఇది రెండు గ్లాస్ లు తాగితే దెబ్బకు సెట్టు

Updated on: Nov 24, 2026 | 2:03 PM

ఈ జావలోని క్యాల్షియం, పోషక విలువలు ఎక్కువగా ఉంటుంది ఇది సులువుగా జీర్ణమయ్యే ఆహారం అయినప్పటికీ, ఆధునిక జీవనశైలికి, సంపూర్ణ పోషణకు మొలకలు వంటివి మంచిదని అంటున్నారు, రాగి జావను రోజువారీ ఆహారంగా కాకుండా.. వేడి చేసినప్పుడు రెండు గ్లాస్ లు తాగితే చాలు.

1 / 5

రాగి జావ ఆరోగ్యానికి  ఎంతో మంచిదని పూర్వం నుంచి ప్రజలు చెబుతున్నారు. ఈ రోజుల్లో దాని ప్రజాదరణ మరింత పెరిగిందని నిపుణులు కూడా చెబుతున్నారు. మొలకలు తినడం కష్టమని భావించే వారికి, ఈ రాగి జావ తాగొచ్చు. దీనిని ఈజీగా  తయారుచేసుకోవచ్చు,  గంటలు గంటలు అవసరం లేదు దీని కోసం.

2 / 5
రాగులలోని పోషక విలువలు 100 గ్రాముల రాగులలో 344 మిల్లీగ్రాముల క్యాల్షియం, 328 క్యాలరీలు, 3.6 గ్రాముల పీచుపదార్థం, సుమారు 7.3 గ్రాముల ప్రొటీన్, 1.3 గ్రాముల కొవ్వు ఉంటాయి. రాగులలో క్యాల్షియం అధికంగా ఉండటం ప్రధాన విశేషం. చిక్కటి ఆవుపాలతో పోలిస్తే రాగులలో దాదాపు మూడు రెట్లు ఎక్కువ క్యాల్షియం ఉంటుంది .ఈ అధిక క్యాల్షియం కారణంగానే పూర్వం వృద్ధులకు, ఎముకలు బలహీనమైన వారికి, నీరసంగా ఉన్నవారికి, మంచం మీద ఉన్నవారికి బలాన్ని, క్యాల్షియంను అందించడానికి రాగి జావను ఇచ్చేవారని చెబుతున్నారు.

3 / 5
మెరుగైన పోషకాహారాలు లభిస్తున్నప్పుడు, రాగి జావపైనే ఆధారపడటం సరైనది కాదని అంటున్నారు. మనకు ఇప్పుడు క్యాల్షియం, పీచుపదార్థాలు, శక్తి అవసరం. అయితే, ఆధునిక జీవనశైలిలో, ముఖ్యంగా నీడపట్టున కూర్చుని పనిచేసే ఉద్యోగులు, వ్యాపారస్తులు, పిల్లలకు అధిక పిండిపదార్థాలు  అవసరం లేదు. మూడు పూటలా ధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకోవడం అధిక కార్బోహైడ్రేట్ల వినియోగానికి దారితీసి అనేక రోగాలకు, హార్మోన్ల సమస్యలకు కారణమవుతుందని హెచ్చరించారు

4 / 5

రాగి జావను రోజువారీ ఆహారంగా కాకుండా, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తీసుకోవాలని ఆయన సూచించారు. కడుపు బాగా లేనప్పుడు, తేలికగా జీర్ణం కావాల్సిన పరిస్థితులలో, సమయం లేనప్పుడు త్వరగా ఆకలి తీర్చుకోవడానికి రాగి జావను తాగవచ్చు. అలాగే, దంతాలు లేని వృద్ధులకు, మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వారికి, మొలకలు వంటివి తినలేని వారికి రాగి జావ మంచిదని, వారికి అది లాభాన్ని చేకూరుస్తుందని అంటున్నారు.

5 / 5
అయితే, మంచి ఆహారం తినే అవకాశం ఉన్నవారు, డబ్బులు ఉన్నవారు, అవగాహన ఉన్నవారు రాగి జావను రోజువారీ తీసుకోవడం సరైనది కాదని డాక్టర్ మంతెన నొక్కి చెప్పారు. ఉదయం పూట రాగి జావ బదులు మొలకలు, పండ్లు తీసుకోవడం వలన  రాగుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ క్యాల్షియం, శక్తి, ఇతర పోషకాలు లభిస్తాయని ఆయన సూచించారు. మొలకలు, పండ్లు వంటి సంపూర్ణ పోషకాహారాన్ని తీసుకోవడం వలన అన్ని హార్మోన్లు సమతుల్యంగా విడుదలవుతాయని, తద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అంటున్నారు

Loading...
Unable to load recommendations.
Follow Us