ప్రీడయాబెటిస్ లక్షణాలు: ప్రీడయాబెటిస్ లక్షణాలు తరచుగా చాలా తక్కువగా ఉంటాయి.. ప్రజలు సాధారణంగా వాటిని విస్మరిస్తారు. కానీ అలసట, తరచుగా దాహం, ఆకలి పెరగడం, బరువులో అవాంఛనీయ మార్పులు వంటి చిన్న చిన్న సమస్యలపై శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం, తరచుగా పుండ్లు కావడం, చూపు స్పష్టంగా లేకపోవడం, గాయాలు, దెబ్బలు త్వరగా మానకపోవడం కూడా ప్రీడయాబెటిస్ సంకేతాలే.. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే రక్తంలో చక్కెరను తనిఖీ చేయాలి.