1 / 5
రాష్ట్ర యువకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం ఈ అంశం పైన చేస్తున్న అసత్య పూరిత ప్రాపగాండాను తిప్పికొట్టి నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా అందించారు. మంత్రి కేటీఆర్ తమతో ఈ అంశం పైన విస్తృతంగా సంభాషించడం తమకు సంతోషాన్ని కలిగించిందని మంత్రితో సమావేశమైన ప్రభుత్వ ఉద్యోగార్థులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వలన యువతలో కొంత ఆందోళన నెలకొందని వారు తెలిపారు.