Pear Fruit juice Benefits: ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి అమృతమే..! అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..

Edited By:

Updated on: Oct 20, 2026 | 8:41 AM

ప్రకృతి ప్రసాదించిన కాలానుగుణ పండ్లలో పియర్ ఒకటి. దీని శాస్త్రీయ నామం పైరస్. ఈ పండు రుచిలోనే కాకుండా, అనేక ఆయుర్వేద, పోషక గుణాలతో నిండి ఉంటుంది. పియర్స్‌లో విటమిన్ సి, విటమిన్ బి-కాంప్లెక్స్, విటమిన్ కె, పొటాషియం, ఫోలేట్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పియర్ పండ్లను నేరుగా తినడమే కాకుండా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ప్రకృతి ప్రసాదించిన కాలానుగుణ పండ్లలో పియర్ ఒకటి. దీని శాస్త్రీయ నామం పైరస్. ఈ పండు రుచిలోనే కాకుండా, అనేక ఆయుర్వేద, పోషక గుణాలతో నిండి ఉంటుంది. పియర్స్‌లో విటమిన్ సి, విటమిన్ బి-కాంప్లెక్స్, విటమిన్ కె, పొటాషియం, ఫోలేట్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

2 / 5
ఎముకల ఆరోగ్యానికి, తక్షణ శక్తికి: పియర్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. నీరసంగా లేదా శక్తి తక్కువగా అనిపించినప్పుడు పియర్ జ్యూస్ తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా తోడ్పడుతుంది.

3 / 5
రక్తహీనత, రక్తపోటు నియంత్రణ: పియర్ ఐరన్‌కు మంచి మూలం. హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారు తరచూ పియర్ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

4 / 5
జీర్ణక్రియ, బరువు తగ్గేందుకు: పియర్‌ను ఫైబర్‌కు ఉత్తమ మూలంగా పరిగణిస్తారు. దీని జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడేవారు తమ డైట్‌లో దీనిని చేర్చుకుంటే బరువు తగ్గుతారు.

5 / 5
డయాబెటిస్, క్యాన్సర్ నివారణ: డయాబెటిస్ ఉన్నవారికి పియర్ పండ్లు లేదా దాని జ్యూస్ ఎంతో ప్రయోజనకరం. వీటిలో ఉండే యాంటీ-డయాబెటిక్ లక్షణాలు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా, ఈ పండులోని విశిష్ట పోషకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా దూరంగా ఉంచడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us