నాగుల చవితి రోజే ఆలయంలోకి నాగసర్పం.. ఇది స్వామివారి అనుగ్రహమంటున్న భక్తులు!
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని ప్రసిద్ధ సారంగధరమెట్టపై వెలసిన శ్రీ బాలా త్రిపురసుందరి దేవి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలోకి నాగసర్పం ప్రత్యక్షమైంది. పవిత్రమైన నాగుల చవితి రోజున స్వామివారి ఆలయంలో నాగసర్పం కనిపించడంతో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
