Chia Seeds: ఆరోగ్యానికి మంచిది కదాని వీటిని తెగ తినేస్తున్నారా? ఒంట్లో ఈ పార్ట్ డ్యామేజ్‌ ఖాయం

|

Oct 08, 2024 | 1:58 PM

నేటి జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే అధిక మంది సులువుగా బరువు తగ్గడానికి చియా విత్తనాలు తింటుంటారు. పోషకాహార నిపుణులు కూడా చియా విత్తనాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. బరువు తగ్గాలనుకునే వారికి, ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి. దీంతో ప్రతిరోజూ ఉదయం చియా సీడ్ వాటర్ తాగుతుంటారు..

1 / 5
నేటి జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే అధిక మంది సులువుగా బరువు తగ్గడానికి చియా విత్తనాలు తింటుంటారు. పోషకాహార నిపుణులు కూడా చియా విత్తనాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. బరువు తగ్గాలనుకునే వారికి, ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి. దీంతో ప్రతిరోజూ ఉదయం చియా సీడ్ వాటర్ తాగుతుంటారు. వీటిని తాగితే బరువు కోల్పోవడం కూడా వాస్తవమే. అయితే వీటిని తీసుకుంటే శరీరానికి ఇతర నష్టాలు కూడా జరుగుతాయి. చియా గింజలు తినడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
చియా విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఫైబర్ ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. అధిక ఫైబర్ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.

3 / 5
చియా గింజల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. కానీ పీచు ఎక్కువగా తినడం వల్ల పేగులు ఆ కార్బోహైడ్రేట్లను గ్రహించలేవు. ఫలితంగా, రక్తంలో చక్కెర స్థాయిలు మారవచ్చు. మీరు విడిగా ఇన్సులిన్ తీసుకున్నప్పటికీ, ఈ విత్తనాలకు దూరంగా ఉండటం మంచిది.

4 / 5
చియా విత్తనాలకు అలెర్జీ సాధ్యమే. ఈ విషయం వివిధ అధ్యయాల్లో రుజువైంది. మీకు ధాన్యం ఆధారిత ఆహారాల అలెర్జీ అయినట్లయితే వీటిని తీసుకోకపోవడమే మంచిది.

5 / 5
ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పదార్ధం అధికంగా శరీరంలోకి ప్రవేశిస్తే, రక్తపోటులో తేడాలు వస్తాయి. చియా విత్తనాలను రోజూ తినడం వల్ల రక్తపోటు సాధారణం కంటే తగ్గుతుంది.