Dish Washing Tips: డిష్ వాషింగ్ సబ్బు అయిపోయిందా? వంటింట్లో వస్తువులతో ఇలా చేసి చూడండి

|

Aug 07, 2023 | 2:09 PM

పాత్రలు కడగడం గురించి ఆలోచించినప్పుడు చాలా మందికి జ్వరం వచ్చినట్లు ఫీల్ అవుతారు. ముఖ్యంగా  నూనె , మసాలా దినుసులతో నిండిన వంట గిన్నెలను శుభ్రం చేయడానికి చాలా శ్రమ పడతారు. గిన్నెలు వాష్ చేస్తున్న సమయంలో సబ్బు అయిపోయినట్లు కనిపిస్తే చిరాకు ఎక్కువవుతుంది. అంతేకాదు జిడ్డు పాత్రలను శుభ్రం చేయడానికి కొన్ని సార్లు రెట్టింపు శ్రమ పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు వంట గిన్నెల్లోని  మొండి మరకలను తొలగించడం కష్టం.

1 / 6
గిన్నెలు కడుక్కునేటపుడు సబ్బు అయిపోయినట్లు కనిపిస్తే చిరాకు ఎక్కువవుతుంది. చాలా సందర్భాలలో వంటలలో వాషింగ్ కోసం లిక్విడ్ సోప్ అవసరం. అయితే ఇలా డిష్ సోప్ అయిపోయినప్పుడు ఇంటిలోని వస్తువుల సహాయంతో శుభ్రపరచుకోవచ్చు. 

2 / 6
వేడి వేడి నీటిలో హ్యాండ్ వాష్ కలపండి. నురుగు ఏర్పడుతుంది. దీంతో పాత్రలు కడగాలి. ఇది వంట పాత్రల  మొండి మరకలను తొలగిస్తాయి. శుభ్రంగా కనిపిస్తాయి. 

3 / 6
పాన్ అడుగున మాడిన మరకలు కనిపిస్తే.. అప్పుడు బేకింగ్ సోడాను నీటితో కలపండి. బేకింగ్ సోడా పేస్ట్‌గా చేసి వంట పాత్రలను శుభ్ర పరచండి.. స్టీలు పాత్రలు మిలమిలా మెరుస్తాయి.

4 / 6
వంటల నుండి నూనె జిడ్డుని తొలగించడం అంత తేలికైన పని కాదు. నిమ్మరసంలో ఉప్పు కలపండి. ఈ మిశ్రమంతో పాత్రలను బాగా కడగండి. ఇది వంట గిన్నెల్లోని మురికిని, బ్యాక్టీరియాను శుభ్రపరుస్తుంది.

5 / 6
బియ్యం కడిగిన నీటితో పాత్రలను కూడా కడగవచ్చు. గిన్నెలు మెరుస్తూ ఒక సులభమైన మార్గం. బియ్యం కడిగిన నీరుతో గిన్నెలు కడిగిన తర్వాత.. మళ్ళీ నీటితో కడగాలి.

6 / 6
వెనిగర్‌తో వంట పాత్రలను కూడా శుభ్రం చేయవచ్చు. వెనిగర్‌ను కొద్దిగా నీటితో కలపండి. ఈ నీటితో పాత్రలను బాగా కడగాలి. తర్వాత స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేయండి. శుభ్రమైన నీటితో కడిగిన తర్వాత పాత్రలు మిల మిలా దర్శనమిస్తాయి. 