హైబీపీ మందులు వాడుతున్నారా..? వామ్మో.. బీకేర్‌ఫుల్.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు..

|

Jan 09, 2025 | 2:02 PM

అధిక రక్తపోటు మందులు (బీటా-బ్లాకర్స్) అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఈ మందులను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం స్థాయిని తగ్గించవచ్చని ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ (ఐపీసీ) తెలిపింది. భారత్‌లో ఇలాంటి సంఘటనలు తక్కువే అయినప్పటికీ.. చాలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

1 / 5
ప్రస్తుత కాలంలో చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు.. హైబీపీ నుంచి బయటపడేందుకు మందులు కూడా ఉపయోగిస్తున్నారు.. అయితే.. అలాంటి మందులు వాడితే జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ మందులతో మీ మూత్రపిండాలు, కాలేయం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ (IPC) తెలిపింది. బీటా-బ్లాకర్స్, సాధారణంగా ఇతర పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు (క్రమరహిత హృదయ స్పందన - అధిక రక్తపోటు) సూచించబడతాయి. ఇవి శరీరంలో తక్కువ పొటాషియం స్థాయిలను కలిగిస్తాయి. బీటా-బ్లాకర్స్ వల్ల వచ్చే హైపోకలేమియా తీవ్రమైన సమస్య అని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయని.. పేర్కొంటున్నారు.

2 / 5
ఔషధాల శక్తి, స్వచ్ఛతకు ప్రమాణాలను అందించే సంస్థ IPC.. బీటా-బ్లాకర్స్ వంటి మందులను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే హైపోకలేమియా (తక్కువ పొటాషియం స్థాయి)కి దారితీస్తుందని తన తాజా అధ్యయనంలో తెలిపింది. ఇలాంటి వాటిపై అవగాహనతో ఉండటం ముఖ్యమని పేర్కొంది.

3 / 5
మందుల దుష్ప్రభావాలపై శ్రద్ధ వహించండి: ఈ ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా ఆరోగ్య నిపుణులు పరిశీలించాలని ఈ అధ్యయనంలో చెప్పారు.. “అటువంటి మందులు రోగికి హాని కలిగిస్తే, వెంటనే నేషనల్ కోఆర్డినేషన్ సెంటర్ (NCC)కి నివేదించండి. PVPI అనేది రోగుల భద్రతను మెరుగుపరచడానికి ఔషధాల నాణ్యత, వాటి దుష్ప్రభావాలను పర్యవేక్షించే ప్రభుత్వ స్వయంప్రతిపత్త సంస్థ.) అని ప్రకటనలో తెలిపింది.

4 / 5
 వృద్ధులకు - మూత్ర సంబంధిత రోగులకు ప్రమాదం: హైపోకలేమియా క్రమరహిత హృదయ స్పందన, ఆకస్మిక దడ, ఇతర ప్రాణాంతక సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు.. కానీ మనం దానిని తరచుగా చూడలేమని పేర్కొంటున్నారు. అయితే, బీటా-బ్లాకర్స్ మందులు తీసుకునేటప్పుడు వృద్ధులు, మూత్ర సంబంధిత సమస్యలు ఉన్న రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారు.

5 / 5
అధిక రక్తపోటు ఉన్న రోగులకు, బీటా-బ్లాకర్స్ మొదటి స్థానంలో ఉపయోగించకూడదు. ఐపీసీ అధ్యయనంపై వైద్యులు మాట్లాడుతూ.. ఈ వ్యాధికి మందులు వాడుతున్న రోగులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సంస్థ తన అధ్యయనంలో దీని గురించి మాత్రమే హెచ్చరించింది. బీటా-బ్లాకర్స్ తీసుకునే వ్యక్తులలో హైపోకలేమియా చాలా అరుదుగా నివేదించబడింది.. అని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే.. వెంటనే వైద్యులకు నివేందించాలన్నారు.