Cleaning Tips: షివాన్ చీరలపై మరకలను ఎలా పోగొట్టాలంటే..

| Edited By: Shaik Madar Saheb

Jan 12, 2025 | 9:54 PM

చీరలు మెత్తగా ఉంటే కట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. అందులోనూ పండుగ సమయంలోనే పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మెత్తగా ఉండే చీరలు కడుతూ ఉంటారు. అయితే ఆ చీరలపై ఒక్కోసారి మరకలు పడుతూ ఉంటాయి. ఈ మరకలు పోవాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి..

1 / 5
ప్రస్తుతం పండుగల సమయం. ఈ టైమ్‌లోనే ఆడవాళ్లు చీరలకు పని పెడతారు. ఎవరికి నచ్చినవి వాళ్లు తీసుకుంటూ ఉంటారు. అయితే షివాను చీరలు మెత్తగా ఉంటాయి కాబట్టి.. వాటిని కట్టుకునేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. కానీ వీటిపై మరకలు పడ్డాయంటే.. అంత ఈజీగా పోవు.

2 / 5
కానీ ఈ హోమ్ మేడ్ టిప్స్‌తో ఈజీగా పోగొట్టవచ్చు. బేకింగ్ సోడా, వెనిగర్ ఉపయోగించి ఈ మరకలు తొలగించవచ్చు. చీరపై మరకలు పడ్డ చోట.. బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి మరకలపై వేసి రుద్దాలి. ఓ పావు గంట సేపు పక్కన పెట్టండి. ఆ తర్వాత వాష్ చేస్తే మరకలు పోతాయి.

3 / 5
నిమ్మకాయ, ఉప్పుతో కూడా మరకలను ఈజీగా పోగొట్టవచ్చు. మరకలు పడిన చోట నిమ్మకాయ రసంలో ఉప్పు కలిపి రుద్దండి. బ్రష్ సహాయంతో రుద్దితే మరకలు పోతాయి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

4 / 5
కార్న్ స్టార్స్‌తో కూడా షివాన్ చీరల మీద పడ్డ మరకల్ని వదిలించుకోవచ్చు. కార్న్ స్టార్చ్‌లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేసి.. మరకలపై వేది రుద్దండి. ఓ ఐదు నిమిషాలు పక్కన  పెట్టి.. ఆరిన తర్వాత బ్రష్ కొడితే మరకలు పోతాయి.

5 / 5
పాలను వాడి కూడా మరకల్ని తొలగించుకోవచ్చు. ఓ బకెట్‌లో నీళ్లు, పాలు కలిపుకోవాలి. మరకలు పడిన ప్రదేశాన్ని ఓ అరగంట పాటు నానబెట్టండి. ఆ తర్వాత మీరు వాడే డిటర్జెంట్ ఉపయోగించి.. బ్రష్ కొట్టండి. మరకలు పోతాయి.