How to Reduce Oil in Cooking: తక్కువ నూనెతో రుచిగా వంట.. ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితేసరి

|

Nov 04, 2024 | 1:43 PM

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆహారంలో నూనె అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు. అలాగని వంటలో నూనె తక్కువగా వాడితే అది రుచిగా ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి నిపుణులు చక్కని టిప్స్ సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5
వేయించిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే, శరీరంలోకి తక్కువ నూనె వెళ్తుంది. బదులుగా వండిన ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. చేపలు, మాంసం, గుడ్లు వంటి ఆహారాలను తక్కువ నూనె, మసాలాలతో ఆవిరితో ఉడికించి తినవచ్చు. ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఆహారంలో వంటనూనె వాడకాన్ని తగ్గించుకోవచ్చు.

2 / 5
నేటి యువతకు ఇది కాస్త కష్టమైన పనే. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ట్రైగ్లిజరైడ్స్ లేదా కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, ఊబకాయం సమస్యలు ఉన్నవారు అధిక నూనె పదార్థాలు తినకూడదు. కొన్ని ఆహార పదార్థాలను చుక్క నూనెతో వండలేనప్పటికీ, వంటలో ఉపయోగించే నూనె మొత్తాన్ని తగ్గించవచ్చు. కొంచెం నూనెతో కూడా రుచికరంగా వండుకోవచ్చు.

3 / 5
నాన్ స్టిక్ పాన్ తక్కువ నూనెతో రుచికరమైన వంట కోసం ఉపయోగించవచ్చు. దీనికి కొద్దిగా నూనె రాస్తే చాలు, ఆహారం బాగా ఉడుకుతుంది. అందువల్ల నూనె ఎక్కువగా వాడే ఆహారపదార్థాలకు నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించవచ్చు.

4 / 5
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్, డయాబెటిస్ సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

5 / 5
పాన్ లోకి నూనె నేరుగా పోయడానికి బదులుగా, ఒక చెంచా ఉపయోగించి పాన్ లోకి నూనె పోయడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే నూనె వినియోగం తగ్గుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి నేరుగా నూనె పోయడం మానుకోవాలి. లేదంటే మీకు తెలియకుండానే నూనె అధికంగా వినియోగించవచ్చు.