చికెన్ గారెలు ఇలా చేస్తే.. అబ్బబ్బా టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు

Updated on: Mar 10, 2026 | 10:15 PM

chicken garelu recipe: చికెన్ ను చిన్న పిల్లల నుంచి పెద్దల ఇష్టంగా తింటారు.అయితే, దీనితో ఒకటి కాదు ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకుని తినొచ్చు. చికెన్ గారెలు అయితే రుచి అదిరిపోతోంది. మరి, వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు: పావు కిలో చికెన్,  అర కప్పు శనగపప్పు,  4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు , కారం, కరివేపాకు, కొత్తిమీర, మసాలా పొడి, నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా చికెన్‌ తీసుకుని బాగా శుభ్ర పరిచి దానిలో ఉన్నా నీటిని తొలగించి 10 నిముషాల పాటు బాగా ఆరనివ్వాలి.

3 / 5
ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్,  శనగపప్పును వేసి మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని కీమాలాగా మెత్తగా అయ్యేలా చేసుకోవాలి.

4 / 5
ఆ తర్వాత దీనిలో తరిగిన ఉల్లిపాయలు ముక్కలు, కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, ఉప్పు వేసి , కొద్దిగా కారం, గరం మసాలా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

5 / 5
ఇప్పుడు చేతులకు నూనె రాసుకుని మినప గారెల్లాగా వేసుకోవాలి. వీటిని రెండు వైపులా బాగా కాలనివ్వాలి. అలా కాలిన వాటిని ఒక ప్లేట్  లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి చికెన్ గారెలు రెడీ.

Follow Us