
100 గ్రాముల మఖానాలో సుమారు 60 mg కాల్షియం ఉంటుంది. ఇది పళ్ళు, ఎముకల పటుత్వానికి ఎంతో అవసరం. పెరుగుతున్న పిల్లలకు, వయసు పైబడిన వారికి ఇది శక్తినిస్తుంది. పాలు, మఖానా కలిపి తినటం వల్ల రెట్టింపు లాభం. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుందని మనకు తెలుసు, అయితే మఖానాలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరానికి అందే కాల్షియం శాతం పెరుగుతుంది. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది.

మఖానాలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి స్నాక్.

గుండె పనితీరును మెరుగుపరచడానికి, రక్తపోటును (Blood Pressure) అదుపులో ఉంచడానికి ఈ ఖనిజాలు సహాయపడతాయి. ఇందులో సోడియం చాలా తక్కువగా ఉండటం వల్ల బీపీ రోగులకు ఇది సురక్షితమైన ఆహారం. మఖానాలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పాలతో కలిపి తీసుకోవటం వల్ల పాలలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

మఖానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మందుల మీద ఆధారపడకుండా సహజ సిద్ధంగా కాల్షియం స్థాయిలను పెంచుకోవడానికి మఖానా ఒక అద్భుతమైన మార్గం. ప్రతిరోజూ ఒక గుప్పెడు మఖానాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. శారీరక నీరసం, అలసట ఎక్కువగా ఉన్నవారు క్రమం తప్పకుండా పాలు-మఖానా తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు. ఇది ప్రకృతి సిద్ధంగా లభించే ఒక సంపూర్ణ పౌష్టికాహారం.

మఖానాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు రాకుండా నిరోధిస్తాయి. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. మఖానాను కొద్దిగా నెయ్యిలో వేయించి, పైన ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని స్నాక్‌గా తీసుకోవచ్చు. పాలలో ఉడికించి ఖీర్ లాగా కూడా తినవచ్చు.