
ఈ కాయలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా తినడానికి ఇవి పుల్లపుల్లగా.. అలాగే వగరుగా ఉంటాయి. అవే ‘వాక్కాయలు’. వీటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దీనిని పచ్చడి రూపంలో కూడా చేసుకుని తినొచ్చు ఇంకా పప్పు, ఊరగాయ రూపంలో కూడా ఇది తినొచ్చు. అలాగే, మనం తినే వాక్కాయల్లో విటమిన్ సి, ఐరన్ ఉంటాయి.

మీరు ఇవి తింటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇది రక్తహీనతను తగ్గించి, గుండె, జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. వాక్కాయలను తింటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి. అయితే, ఇది మీ డైట్లో ఎందుకు చేర్చుకోవాలి? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..

వాక్కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు ఇలా ఒక్కో ఏరియాను బట్టి దీనిని పిలుస్తారు. ఈ వాక్కాయలతో మీరు పులిహోర చేసుకుని తినొచ్చు. ఈ వాక్కాయ వగరు, పుల్లగా ఉంటుంది. ఇంకా ఈ వాక్కాయను చింతకాయ అంత పులుపు ఉంటుంది. ఈ చెట్టు పూవులు తెల్లగా ఉంటాయి. ఇంకా మంచి సువాసనతో ఉంటాయి.

రక్తంలో చక్కెర లెవెల్స్ : ఈ వాక్కాయలు మీ మూత్ర నాళాన్ని క్లీన్ చేయడంలో ఇవి సహాయపడతాయి. ఇంకా కిడ్నీలో రాళ్లు కూడా ఇవి కరిగిస్తాయి. ఇంకా రక్తంలో చక్కెర లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. మీరు వాక్కాయ ఆకుల కషాయం తాగితే జ్వరం వెంటనే తగ్గిపోతుంది.

. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)