గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! ఈజీగా బరువు తగ్గి నాజుగ్గా..

Updated on: Aug 12, 2026 | 7:15 PM

నేటి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలామంది ఉదయాన్నే తాగే పాలు, టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సాధారణంగా గ్రీన్ టీ తాగడం కంటే, దానిని తాగే సమయం, అందులో కొన్ని ప్రత్యేక పదార్థాలు కలపడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన డైట్, వ్యాయామంతో పాటు గ్రీన్ టీని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో చాలామంది టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు సరైన సమయం మరియు ఆహార నియమాలు పాటిస్తూ నెలలో 3-4 కిలోలు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికి 30 నిమిషాల వాకింగ్ తోడైతే ఫలితాలు వేగవంతమవుతాయి.

2 / 5
గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం ఎప్పుడు?: ఉదయాన్నే నిద్రలేచిన 30 నిమిషాల తర్వాత మొదటి కప్పు గ్రీన్ టీ తాగాలి. ఇది శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతుంది. మధ్యాహ్నం భోజనానికి 30 నిమిషాల ముందు మరొక కప్పు తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీలో చక్కెర గానీ, తేనె గానీ కలపకూడదు.

3 / 5
నెయ్యి, దాల్చినచెక్కల కలయికతో మూడింతల లాభం!: గ్రీన్ టీ ప్రభావాన్ని పెంచడానికి అందులో నెయ్యి, దాల్చినచెక్క కలిపి తీసుకోవడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గ్రీన్ టీలో అరస్పూన్ నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల అందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి సమర్థవంతంగా అందుతాయి. నెయ్యిలోని బ్యూటైరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

4 / 5
దాల్చినచెక్కలోని సిన్నమాల్డిహైడ్ శరీరంలో వాపులు తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. గ్రీన్ టీ, నెయ్యి, దాల్చిన చెక్క మూడింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.

5 / 5
నెలకు 3-4 కిలోలు తగ్గడానికి అదనపు చిట్కాలు: గ్రీన్ టీతో పాటు రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేయాలి. రాత్రి వేళల్లో తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో కూడా గ్రీన్ టీ ప్రభావం కొనసాగి శరీరంలోని క్యాలరీలు కరుగుతాయి. ఈ చిన్న చిన్న మార్పులతో సులభంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us