వర్షాకాలంలో ముల్లంగి తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!

Updated on: Sep 01, 2026 | 12:13 PM

వర్షాకాలం ప్రారంభం కాగానే వాతావరణంలో తేమ పెరిగి రకరకాల ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమయంలో మనం తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా దుంపకూరలు, భూమి లోపల పండే ముల్లంగి వంటి కూరగాయలను వర్షాకాలంలో తినవచ్చా లేదా అనే అయోమయం చాలామందిలో ఉంటుంది. ఈ విషయమై ఆరోగ్య నిపుణులు వెల్లడించిన నిజాలు, జాగ్రత్తలు తప్పక తెలుసుకోవాలి..

1 / 5
రోగనిరోధక శక్తి పెంపు: ఇందులో విటమిన్ సీ, ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు ఎక్కువ. ముల్లంగిలో ఉండే విటమిన్ సీ, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.

2 / 5
జీర్ణక్రియకు మేలు: జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కాలేయాన్ని శుభ్రపరచడంలో ఇది తోడ్పడుతుంది. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ కాస్త మందగిస్తుంది. ముల్లంగిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణక్రియ సులభంగా జరిగేలా చూస్తుంది.

3 / 5
లీవర్, కిడ్నీల ఆరోగ్యం: ముల్లంగికి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. ఇది కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

4 / 5
వర్షాకాలంలో ఉండే ముప్పు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నేల అడుగున పెరుగుతుంది. వర్షాకాలంలో నేలలో తేమ, బురద ఎక్కువగా ఉండటం వల్ల దీని చర్మంపై హానికరమైన బాక్టీరియా, ఈ-కోలై,సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉంది. వేసవి, చలికాలంలో ముల్లంగిని సలాడ్ల రూపంలో పచ్చిగా తింటుంటారు. కానీ వర్షాకాలంలో పచ్చి ముల్లంగి తింటే కడుపునొప్పి, డయేరియా లేదా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.

5 / 5
ఎలా తీసుకోవాలి?: ముల్లంగిని మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో అనేకసార్లు కడగాలి. దానిపై ఉన్న పల్చని పొరను చెక్కి వేయాలి. ముల్లంగిని బాగా ఉడికించి సాంబార్, కర్రీ, లేదా పరాటాల రూపంలో మాత్రమే తీసుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us