
చూడటానికి ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ చిన్నగా కనిపించినా.. పోషకాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఇవి సాధారణ గింజలు కావు చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే, వీటిలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, మెగ్నీషియం, మంచి కొవ్వులు ఉంటాయి. నిజం చెప్పాలంటే నాన్ వెజ్ కన్నా కూడా ఇవి చాలా ఎక్కువే అని చెప్పాలి.

ఇవి ఎక్కడ మార్కెట్లో అయినా సులభంగా తగ్గుతాయి. సన్‌ఫ్లవర్ గింజలు తిన్నా ఒకటే గుడ్డు తిన్నా ఒకటే ఎందువలన అంటే దీనిలో అదే మాదిరి ప్రోటీన్, మెగ్నీషియం దీనిలో కూడా దొరుకుతాయి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఒక స్పూన్ సన్ ఫ్లవర్ గింజలు తింటే ఒక గుడ్డు తిన్నట్లు లెక్క. ఇంకా దీనిలో పోషకాలు సహజంగానే దొరుకుతాయి.

ఈ సన్‌ఫ్లవర్ గింజల్లో ఉండే విటమిన్-ఈ శరీరాన్ని కాపాడుతుంది ఇంకా చెప్పాలంటే యాంటీఆక్సిడెంట్‌గా ఇది పనిచేస్తుంది. అలాగే దీనిలో ఉండే ముఖ్య పోషకం మెగ్నీషియం కండరాలు, నరాల బలాన్ని పెంచుతాయి. మీ శరీరంలోని పనులకు ఇది చాలా అవసరం. అందుకే కొందరు దీనిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు.

ఈ సన్‌ఫ్లవర్ గింజలను రోజూ మీరు ఒక స్పూన్ స్నాక్‌గా, సలాడ్స్ లో వీటిని కలిపి తినవచ్చు. అయితే ఇది బుడ్డి గింజే అయినా.. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. కాబట్టి, మీరు కూడా వీటిని తింటూ ఉండండి. ఒకసారి తినడం మొదలు పెడితే శరీరంలో కొత్త మార్పులు వస్తాయి.

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)