Heart Health: గుండె ఆరోగ్యం కోసం ఖాళీ కడుపుతో తప్పక తాగాల్సిన 5 డ్రింక్స్.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే..?

|

Sep 21, 2023 | 3:22 PM

Heart Health: రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన ఆరోగ్యంపై.. ముఖ్యంపై గుండె పనితీరుపై చెబు ప్రభావం చూపుతాయి. ఈ కారణంగానే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య కూడా నానాటీకి పెరుగుతోంది. గుండె ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని రకాల డ్రింక్స్ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
నిమ్మకాయ-తేనె నీరు: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం, తేనె కలిపి తాగితే శరీరానికి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి మెరుగుపడడంతో పాటు గుండెపోటు, రక్తపోటు ప్రమాదం తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

2 / 5
క్రాన్‌బెర్రీ జ్యూస్: క్రాన్‌బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.  చక్కెర కలపకుండా క్రాన్బెర్రీ జ్యూస్‌ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే గుండెకు మరింత మేలు జరుగుతుంది.

3 / 5
సీజన్‌ మారినప్పుడు ఫ్లూ, జలుబు చాలా సాధారణం. చల్లని గాలి కారణంగా పొడి దగ్గు, జలుబు చికాకు పెడుతుంది. సమయానికి జలుబు నివారణకు తగిన చర్యలు తీసుకోకపోతే, న్యుమోనియా వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. జ్వరం-జలుబు ఎక్కువ కాలం తగ్గకపోతే, తప్పనిసరిగా యాంటీబయాటిక్స్ సహాయం తీసుకోవాలి. కేవలం పారాసిటమాల్ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తగ్గిపోదు. కానీ వీటి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ప్రత్యక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

4 / 5
బీట్‌రూట్ జ్యూస్: బీట్‌రూట్ జ్యూస్ నైట్రేట్‌లతో సహా అనేక రకాల పోషకాలకు పవర్‌హౌస్. ఇది రక్త నాళాలను విస్తరించి రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా ఉదయాన్నే బీట్‌రూట్ రసం తాగడం వల్ల మీ గుండెకు కూడా మేలు జరుగుతుంది.

5 / 5
గ్రీన్ టీ: క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంతో పాటు రక్తపోటు, గుండెపోటు రిస్క్ తగ్గుతుంది.